Sunday, February 28, 2016

పంచామృతం
-----------అనువాదం--రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్.
ఐదుగురు పిల్లలకు తండ్రినైన నేను
అప్పుడప్పుడూ అవసరార్ధం వారి వారి
అంతరాంతరాళాల్లోకి తొంగి చూస్తుంటాను.

పెద్దవాడు తనో ప్రముఖ చిత్రకారుడినన్న
తలంపుతో,కుంచె ,రంగులపెట్టెతో
కాగితాలను ఖరాబుచేస్తూకనబడుతుంటాడు.

రెండో వాడు మాత్రం తనకన్నా సోమరిపోతెవడూ
లేడన్న రీతిలో భ్రమలో భ్రమరంలా తిరుగుతుంటాడు.

మూడో వాడుమాత్రం ముద్దరసుద్దిగా
చదువుకుంటూ  బుద్ధిమంతుడిలా వుంటాడు.

ఏదైనా కవితలో అల్లుతూ కూర్చోరా అంటే
అవేమీ పట్టనట్టు పుస్తకాలలో పురుగై పోతాడు.

నాలుగోవాడు మేధోవర్గంలోకి వెనువెంటనే వెళ్ళాలనుకుని
కూడికలూ తీసివేతలు తెలియవంటూ వంకర్లు తిరుగుతుంటాడు.

అందరికన్నా చిన్నవాడు అదోరకంగా అయోమయంతో
గట్టిగా పెనవేసుకునిపోయిన మంద భాగ్యుడు.
తన ప్రపచం తనదేనన్నట్లు చిరుమందహాసాలతో
చరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే పనిలో నిమగ్న మౌతాడు.

ఇదండీ దేవుడు నాపై దయతో ప్రసాదించిన ప్రబుద్ధులు.

వీటన్నింటికీ తలొగ్గడానికికిష్టపడని నేను
నా దైనందిన కార్యక్రమమైన మధుసేవనంలో
బాధే సౌఖ్యమన్న భావనలో మునిగితేలుతూ
తరించిపోతూ ధన్య జీవనాన్ని గడుపుతుంటాను.
[ TAO   QIAN       క్రీ శ.  [ 365-427] కాలానికి
 చెందిన కవి  కవిత   చదివిన  ప్రేరణతో---]

No comments:

Post a Comment