Friday, February 12, 2016

అసలు ముఖపరిచయంకూడా లేని అతనితో
సంభాషించి తీరాలన్న తాపత్రయం.
ముభావంగానే అనునిత్యం ఎదురయే అతనితో
ఎలాగయినా మాటలు కలుపాలన్న తపన నాలో
క్షణ క్షణాభి వృద్ధిచెందుతున్నదివిచిత్రంగా!!



అసలు ఆ పుస్తకాన్ని గురించి ఎవరినోటిగుండా
వినకపోయినా ఆ నవలనో,కధానికల సపుటినో
అప్పుడే ప్రచురణ కర్మాగారమ్నుంచి విడుదలైన
కవితా సంపుటిని చదవాలనుకోవడం తప్పనుకోలేం,గదా!
అలాగే అతనితో సంభాషివాలనుకోవడంకూడా
తప్పుక్రింద జమకాబోదని నా నిశ్చితాభిప్రాయం.



మొట్టమొదటగా పదాలన్ని పెదవులుదాటి
 బయటకు రావడానికి భీష్మించుకు
కూర్చుంటాయనికూడా తెలుసు.
మొండికేసి నన్ను పరిపరి విధాలుగా
విసిగించి వేధిస్తుంటాయనీ తెలుసు.


అయినా అతనితో సంభాషించి తీరాలన్న తపన
నన్ను అణువణునా ఆక్రమించి ఆందోళనకు
గురుచేస్తుదనికూడా గ్రహించాను గుర్తించాను.
అయినా అతనితో ఆత్మీయంగా సంభాషించాలన్న
తపన నన్ను ససేమిరా వదిలి నిష్క్రమించేలాలేదు.



నిరాకారుడైన భగవంతుడిని
రకరకాల ప్రార్ధనలతో
విసిగించడం నాకు కొత్తేమీ కాదుసుమా!
నాకష్టసుఖాలలో అతనే తోడూ నీడనుకుంటూనే

 ప్రవర్తించడం
నేనెరుగని బ్రహ్మ విద్యేమీ కాదుగదా!!
ఎదురుగా నాకనులముందు పూర్ణరూపంతో
ఎదురవుతున్న ఆవ్యక్తితో సంభాషించడం
కష్టతరమైన విద్యేం కాదనే నాప్రగాఢ విశ్వాసం.
===================================


No comments:

Post a Comment