ఆవిడ అదేపనిగా
దు:ఖ స్నాతయై విలపిస్తున్నది.
తీరానికి తలలు తాటించి
వందల శకలాలుగా విడివడుతున్న
కల్లోల సంద్రంలోని అలల ఆవేదను
అంతరంగ మధనంతో సరిపోల్చుకుంటూ.
ఆమే సూర్య భగవానుడిని
వెంటబడి తరుముతున్నదా ఏమిటి?
రోజంతా చీకటి విస్తరించి
చందమామకు తారాలను
వుయ్యాలలూపే మనోజ్ఞమైన
దృశ్యాన్ని కనులారా వీక్షించాలన్న
తపనతో--
ఆవిడ ఇప్పుడు సంతాపతప్త
హృదయయై ఘోషిస్తున్నది.
రొఝంతా తమ వికసనంతో
కన్నులకు విందునంద జేసిన పూలన్నీ
వాడిపోయి నేలకు చిమ్మటి చీకటిని
కానుకగా అందిస్తున్నదన్న ఆవేదనతోనూ కాదు.
ఒక రుతువంతటినీ సౌందర్య సీమలలో
విహరింపజేసిన తరువులనంటిపెట్టుకుని
ప్రభవించిన ఆకులు పరిణామక్రమంలో
వేగంగా రాలిపడే వానచినుకుల్లా
నేలతల్లిని ముద్దాడుతూ మురిసిపోతున్నందుకు
మళ్ళీ వసంతానికే పునర్దర్శనమని
బాధగా నిస్క్రమిస్తున్న అప్పగింతల దృశ్యాన్ని చూసి.
==========================================
దు:ఖ స్నాతయై విలపిస్తున్నది.
తీరానికి తలలు తాటించి
వందల శకలాలుగా విడివడుతున్న
కల్లోల సంద్రంలోని అలల ఆవేదను
అంతరంగ మధనంతో సరిపోల్చుకుంటూ.
ఆమే సూర్య భగవానుడిని
వెంటబడి తరుముతున్నదా ఏమిటి?
రోజంతా చీకటి విస్తరించి
చందమామకు తారాలను
వుయ్యాలలూపే మనోజ్ఞమైన
దృశ్యాన్ని కనులారా వీక్షించాలన్న
తపనతో--
ఆవిడ ఇప్పుడు సంతాపతప్త
హృదయయై ఘోషిస్తున్నది.
రొఝంతా తమ వికసనంతో
కన్నులకు విందునంద జేసిన పూలన్నీ
వాడిపోయి నేలకు చిమ్మటి చీకటిని
కానుకగా అందిస్తున్నదన్న ఆవేదనతోనూ కాదు.
ఒక రుతువంతటినీ సౌందర్య సీమలలో
విహరింపజేసిన తరువులనంటిపెట్టుకుని
ప్రభవించిన ఆకులు పరిణామక్రమంలో
వేగంగా రాలిపడే వానచినుకుల్లా
నేలతల్లిని ముద్దాడుతూ మురిసిపోతున్నందుకు
మళ్ళీ వసంతానికే పునర్దర్శనమని
బాధగా నిస్క్రమిస్తున్న అప్పగింతల దృశ్యాన్ని చూసి.
==========================================
No comments:
Post a Comment