నేను మానవమాత్రులెవ్వరినీ
ప్రేమించకముందే
ప్రకృతిమాతపట్ల
ఆరాధనా భావాన్ని
అలవరచుకున్నాను!
నేను మరోవ్యక్తిని పరిచయం
చేసుకోకముందే నాపూలతోటలోని
ప్రతిమొక్కనూ పలుకరించాను.
ప్రేమించడం ఒక అర్ధవంతమైన దృక్పధమనీ,
అందమొక్కటే దానిపట్ల అన్వర్ధం కాదనీ
తెలుసుకున్న తర్వాత నలుపూ తెలుపులను
సమభావంతో సమాదరించడం నేర్చుకున్నాను.
ఇచ్చిపుచ్చుకోవడంలో ఇమడలేని
వైవిధ్యాన్ని ముందస్తుగా
నిరసించడం మొదలెట్టాను.
ఐక్య భావనతో దానికి
నిష్క్రమణ ద్వారాన్ని చూపి
స్వేఛ్చగా ఊపిరిపీల్చుకున్నాను.
ప్రేమ ప్రేమ అంటూ పలవరించగానే
సరిపోదు పదికాలాలపాటు దాన్ని
గుండే గొంతుకలో పదిలంగా
దాచుకోగలగాలనీ యదార్ధంగా
విశ్వసించాను..వాస్తవిక దృక్పధంతో
వ్యవహరించాలని గట్టిగా
నిర్ణయం తీసుకున్నాను.
=============================
ప్రేమించకముందే
ప్రకృతిమాతపట్ల
ఆరాధనా భావాన్ని
అలవరచుకున్నాను!
నేను మరోవ్యక్తిని పరిచయం
చేసుకోకముందే నాపూలతోటలోని
ప్రతిమొక్కనూ పలుకరించాను.
ప్రేమించడం ఒక అర్ధవంతమైన దృక్పధమనీ,
అందమొక్కటే దానిపట్ల అన్వర్ధం కాదనీ
తెలుసుకున్న తర్వాత నలుపూ తెలుపులను
సమభావంతో సమాదరించడం నేర్చుకున్నాను.
ఇచ్చిపుచ్చుకోవడంలో ఇమడలేని
వైవిధ్యాన్ని ముందస్తుగా
నిరసించడం మొదలెట్టాను.
ఐక్య భావనతో దానికి
నిష్క్రమణ ద్వారాన్ని చూపి
స్వేఛ్చగా ఊపిరిపీల్చుకున్నాను.
ప్రేమ ప్రేమ అంటూ పలవరించగానే
సరిపోదు పదికాలాలపాటు దాన్ని
గుండే గొంతుకలో పదిలంగా
దాచుకోగలగాలనీ యదార్ధంగా
విశ్వసించాను..వాస్తవిక దృక్పధంతో
వ్యవహరించాలని గట్టిగా
నిర్ణయం తీసుకున్నాను.
=============================
No comments:
Post a Comment