Wednesday, February 24, 2016

నాకోసం ఆమెయనీ
ఆమె కోసమేనేననీ
అడుగడుగునా అనుకుంటూ
జీవనం సాగించాము.

నాలోసగమనుకున్న తను
ఆఖరిశ్వాస విడిచాక
ఇప్పుడిక నాకోసమే
నేననుకుంటుంటే
శేషజీవితం పకాలున
నవ్వడం మొదలెట్టింది.
=====================

No comments:

Post a Comment