కాలం గడుస్తున్నకొద్దీ నన్ను నేనే కోల్పోతున్నానన్న అనుభూతి.
అది వ్యవస్థమీద వైరాగ్యమని నేను భావించడంలేదు.
సహనాన్ని కోల్పోతున్న మానవజాతిమీఎద ద్వేషంతోనూకాదు.
ఇదేదో వ్యక్తినిష్టమైన సంఘర్షణలో కాలం గీస్తున్న నుదుటి గీతలు!!
నీలోవొక్కడిగా వుంటూ ఊపిరిపీలుస్తూ కాలం గడిపినంతకాలం
నీ హృదయానికి అతి సన్నిహితంగా చరిస్తున్నానన్న తృప్తివుండేది.
నీ కనులలో నారూపం కలకాలం వుండిపోతుందని భ్రమ పడ్డాను.
నేనొక దృశ్యమానమైన చిత్తరువునై చూపరులకు చిరుదరహాసాల
నందిస్తూ,కరగని కలలా కాలమంతటినీ కౌగిలించుకుని కమనీయంగా మిగిలిపోతానని
భావించి పొరబడ్డాను.
కరగని మంచులా నీ లో తిష్టవేసివున్నంతకాలం
మలయమారుతంలా పిల్లగాలులను ప్రసరింపజేస్తూ
మనసులకన్నింటికీ ఆహ్లాదాన్నందిస్తానని భ్రమపడ్డాను.
నీవు నవ్వితే ఆసవ్వడిలో సుమధురనాదాలను వింటూ
పరశనై పొంగి సురభిళ పరిమళమై ప్రసరించాను.
ఇప్పుడు డామిట్, కధంతా క్షణాల్లో మారి నాలో అల్లకల్లోలతరంగాలను శృష్టించి అలజడినిరేపుతున్నది.
చుట్టూ పరుచుకుని గుట్టల్లా మిగిలిపోయిన మంచు దిబ్బలన్నీ
కరగి నీరై కాలువల్లోకి ప్రవహిస్తున్న దృశ్యం
కాలం తీరు మారిందనీ పరిణామక్రమేదో చోటు చేసుకున్నదనీ
ఇట్టే అవగతమై నన్ను ఆందోళనుకు గురిచేసి వేధిస్తున్నది.
ఇప్పుడు ఎటుచూసినా శూన్యపరిధి విస్తరిస్తున్న రీతి తెలిసిపోతున్నది.
నీ అదృశ్యమైన రూపమే నాలో అధివసించి.నన్ను చైతన్యరహితుడిగా
మలుస్తున్నదని నా అనుమానం.
మంచుదనంకోల్పోయిన హిమాలయంలా చల్లదనాన్ని దగ్గరకు చేర్చుకోలేకపోతున్న ఉదకమండలంలా ఉనికినికోల్పోతూ
నానైసర్గిక స్థితినిక్రమేపీ పోగొట్టుకుంటూ భయభ్రాంతులకు గురై
నన్నునేనే కోల్పోతున్నానన్న యదార్ధ వాదానికి వడివడిగా చేరుకుంటున్నాను.
అందుకే నేస్తం నన్ను నేనుకోల్పోయి నీలో కలిసిపోవడానికి
రోజులను లెక్కించుకుంటూ కాలం కనీటి ధారలకు నిలయంగా మారుస్తూ
విషణ్ణవదనంతో వెనుదిరిగి వస్తున్నాను.
==================================================

No comments:
Post a Comment