అనాధ ప్రేత సంగమం
-----------------------రావెల
సాయం సమయాన
నదీతీరం వెంట
నడకదారిలో వెడుతుంటే
బలంగా కాలికి
గట్టిపదార్ధమొకటి
గబాలున తగిలింది.
నూనుగుమీసాల
నూత్న యవ్వనంలో
మిసమిసలాడుతున్న
ఓ యువకుడి శవం!!
ఏ తల్లికన్న బిడ్డోపాపం
లక్ష్యం చేరుకునే దిశలో
అకాలమృత్యువుకు
ఆహారమై పోయాడు.
ఉగ్రవాదభావాలు
అతన్ని బలితీసుకున్నాయా?
మతమౌఢ్యం విసిరిన వలలో
అసువులుబాసాడా?
కులాలమధ్యన చెలరేగుతున్న
సంకుల సమరంలో
సమిధయై పోయాడా?
ఏదేమైతేనేం
యేదేసపొరుడైతేనేం
భవిష్యత్తున
ఒక యువ కిశోరాన్ని
ఆ దేసంకోల్పోయిందని
బాధపడ్దాను.
చెమర్స్తున్నాయ్ కళ్ళు!!
యేదేశపౌరుడయితేనేం?
శాంతివచనాలు
మనసులోకి ఇంకకుండా
అడ్డుకున్న నెత్తురు
పిశాచాలకు నేరుగా
బలయిన వాడు.
అతని పుట్టినరోజు
తెలిస్తే బాగుండు
ఏడాదికొకసారయినా
అతనిపేరున సంబరంజేసి
అతని ఆత్మకైనా శాంతినిమ్మని
పరమాత్మను ప్రార్ధిస్తుంటాను.
[ఓ ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో]
-----------------------రావెల
సాయం సమయాన
నదీతీరం వెంట
నడకదారిలో వెడుతుంటే
బలంగా కాలికి
గట్టిపదార్ధమొకటి
గబాలున తగిలింది.
నూనుగుమీసాల
నూత్న యవ్వనంలో
మిసమిసలాడుతున్న
ఓ యువకుడి శవం!!
ఏ తల్లికన్న బిడ్డోపాపం
లక్ష్యం చేరుకునే దిశలో
అకాలమృత్యువుకు
ఆహారమై పోయాడు.
ఉగ్రవాదభావాలు
అతన్ని బలితీసుకున్నాయా?
మతమౌఢ్యం విసిరిన వలలో
అసువులుబాసాడా?
కులాలమధ్యన చెలరేగుతున్న
సంకుల సమరంలో
సమిధయై పోయాడా?
ఏదేమైతేనేం
యేదేసపొరుడైతేనేం
భవిష్యత్తున
ఒక యువ కిశోరాన్ని
ఆ దేసంకోల్పోయిందని
బాధపడ్దాను.
చెమర్స్తున్నాయ్ కళ్ళు!!
యేదేశపౌరుడయితేనేం?
శాంతివచనాలు
మనసులోకి ఇంకకుండా
అడ్డుకున్న నెత్తురు
పిశాచాలకు నేరుగా
బలయిన వాడు.
అతని పుట్టినరోజు
తెలిస్తే బాగుండు
ఏడాదికొకసారయినా
అతనిపేరున సంబరంజేసి
అతని ఆత్మకైనా శాంతినిమ్మని
పరమాత్మను ప్రార్ధిస్తుంటాను.
[ఓ ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో]
============================
No comments:
Post a Comment