Wednesday, February 24, 2016

అంతటా అగణితసత్యభాషే వ్యాప్తిచెందితే
ఈ పొరపచ్చాల పోరు బాట ప్రస్థానం ఎందుకుంటుంది?
పొట్టచీల్చుకుని శరవేగంగా చీల్చుకొచ్చే
 అబద్ధాలకెందుకు ఆశ్రయం దొరుకుతుంది?
అందరూ హరిశ్చంద్రులే అయి చరిస్తుంటే
ఈ నక్షత్రకులకు నేలపై నెలవెక్కడుంటుంది?

అన్ని చోట్లా శ్రీరామచంద్రుడే


ఇష్టదైవమై నిలిస్తే
ఈ రెండో భార్య,మూడోకొడుక్కీ
మూడో భార్య నాలుగోకూతురికీ
అంతరంగ ద్వేషాలెందుకు
అలముకుని అస్తవ్యస్తంగా కుటుంబ కధలిలా
బజారుకెక్కి ఎందుకు వేధిస్తుంటాయి?

అందరూ శ్రీమహావిష్ణువు యొక్క  వైష్ణవ సంతతే అయితే
బుట్టలోని జలపుష్పాలెలా అదృశ్యమై పోతాయి?

అందరు నేతలూ ఇత:పూర్వం చేసిన వాగ్దానాలనే
నిలబెట్టుకోగలిగితే ఈ ఆర్భాటపు ఎన్నికలెందుకు
ఏకగ్రీవం కాకుండా జరుగుతున్న ఎన్నిక ప్రక్రియలెందుకు
కొనసాగుతూ కొన ఊపిరులతో బయటపడే వైశద్యం ఎందుకు?


అందుకే వినయ శీలంతో విన్నవిస్తున్నా
శూన్యంలోనుంచి మాత్రమే శబ్దం పుట్టుకురాదు!!
శబ్దం నుంచే సమస్త నాద ప్రక్రియ ఊపిరిపోసుకుని
ప్రభవించి ప్రయోజనకారిగా పరిణమిస్తుంది?
==================================

No comments:

Post a Comment