Wednesday, February 17, 2016

ఆకాశానికి తెలుసు
ఎన్ని సార్లు బాల్యంలో
తన తరూసమూహంపైన
శాఖాచంక్రమణంచేసానో.

అస్తమించడానికి సిద్ధమయిన
సూర్యభగవానుడి కెరుకే
ఎంత విసురుగా గాలి వీచినా
 నేనెగిరి క్రిందకు పడిపోకుండా
సున్నితంగా నా నడకను కొన సాగించానో!!

నా ఎదురుగానిలబడిన పూలతోటకు తెలుసు
ఎన్నిసార్లు నామనసు చీకాకుల పాలయినప్పుడు
మలయమారుతాన్ని సురభిళ భరితంగా వీచి
నన్నెన్ని సార్లు సంతోష సాగరంలోముంచి తేల్చాయో!

నా ఇంటిముందు కల్లాపిలా మంచును జల్లి
ఆతారురోడ్లను సున్నంతో పరిషెచనంజేసి
ముందు వాకీకెంత కళాకాతులను సంతరింపజేసి
నాలోని సౌందర్య భావాలకు సేతువుగా నిలిచిందో
ప్రకృతిమాతనెప్పుడడిగినా ఇట్టే చెప్పేయగలదు నన్ను నమ్ము!

ఇవన్నీ తలచుకున్నప్పుడల్లా నా అనుభూతికి
అంతు అడ్డులు లేవని ఇట్టే స్పష్టమౌతున్నది.


ఇంతకన్నా శేషజీవితప్రస్థానంలో నేను సంపాదించగల
అమూల్యమౌ ఆస్థి పాస్తులింకేముంటాయి,మీరేచెప్పండి.
========================================

No comments:

Post a Comment