అందిపుచ్చుకున్న
ఆధునికసాంకేతికపరిజ్ఞానం
ఆత్మీయతానురాగబంధాలను
మూకుమ్మడిగాదాడిచేసి
అదృశ్యస్థావరంలోకి నెట్టేసి
హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నది.
ఉత్తరాల ఊసు క్రమేపీ మృగ్యమైపోతూ
క్రమేపీ కనుమరుగయి పోవడానీ సిద్ధమయింది.
హృదయగతవేదనలనుసునిశితంగ
ఆవిష్కరించుకునే
వీలును పూర్తిగాకోల్పోయింది....
ముచ్చట్లతో ఎదురుబదురుగా కూర్చొని
సంతసించే మనసు ---ముభావాన్ని
ముద్దిడుకుని -మూగగా---మురిసిపోతున్నది.
అంతరంగమంతావేదనాభరితమై
అతలాకుతలమై కునారిల్లుతున్నది.
కాలసర్పం కటువుగా కాటేయగల
సందర్భంకోసం ఆశగాఎదురుచూస్తున్నది.
అగ్గిపెట్టెను మానవాళికి కానుకగా ఇచ్చిన
పరమాత్ముడు మనం దీపంవెలిగించుకుని
చీకట్లను దూరంగా తరిమేయగలమాలేదా అని
తన నిజనివాసం నుండి తీక్షణంగా దీక్షగా
ఎదురుచూస్తూ మనం దానితో నివాసముంటున్న ఇంటిని
తగలబెట్టుకోకూడదని
మనసారా మన క్షేమం కోరే శ్రేయోభిలాషిగా
నిరంతరం మనజ్ఞానజ్యోతి నిఖిలమై నిరవద్యయై
నిలబడాలని అనియతంగా అభిలషిస్తున్నాడు.
=====================================================
ఆధునికసాంకేతికపరిజ్ఞానం
ఆత్మీయతానురాగబంధాలను
మూకుమ్మడిగాదాడిచేసి
అదృశ్యస్థావరంలోకి నెట్టేసి
హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నది.
ఉత్తరాల ఊసు క్రమేపీ మృగ్యమైపోతూ
క్రమేపీ కనుమరుగయి పోవడానీ సిద్ధమయింది.
హృదయగతవేదనలనుసునిశితంగ
ఆవిష్కరించుకునే
వీలును పూర్తిగాకోల్పోయింది....
ముచ్చట్లతో ఎదురుబదురుగా కూర్చొని
సంతసించే మనసు ---ముభావాన్ని
ముద్దిడుకుని -మూగగా---మురిసిపోతున్నది.
అంతరంగమంతావేదనాభరితమై
అతలాకుతలమై కునారిల్లుతున్నది.
కాలసర్పం కటువుగా కాటేయగల
సందర్భంకోసం ఆశగాఎదురుచూస్తున్నది.
అగ్గిపెట్టెను మానవాళికి కానుకగా ఇచ్చిన
పరమాత్ముడు మనం దీపంవెలిగించుకుని
చీకట్లను దూరంగా తరిమేయగలమాలేదా అని
తన నిజనివాసం నుండి తీక్షణంగా దీక్షగా
ఎదురుచూస్తూ మనం దానితో నివాసముంటున్న ఇంటిని
తగలబెట్టుకోకూడదని
మనసారా మన క్షేమం కోరే శ్రేయోభిలాషిగా
నిరంతరం మనజ్ఞానజ్యోతి నిఖిలమై నిరవద్యయై
నిలబడాలని అనియతంగా అభిలషిస్తున్నాడు.
=====================================================
No comments:
Post a Comment