Thursday, February 4, 2016

దిదృక్ష
------------------రావెల.


అందమైన వస్తువులేవైనా కంటబడినప్పుడల్లా
చూపులు అక్కడే అతుక్కుపోవాలని శతవిధాలా శ్రమిస్తాయి.
విశేషంగాఇతరుల అంగీకారంకోసం
 ఆశగా ఎదురుచూస్తుంటాయి.

తనవైపు ఎవరో సూటిగా దృష్టిని సారిస్తున్నారని
చూపులు గమనిస్తే

ఆదృశ్యం  చీవాట్లు పెడుతున్నట్లు ముఖ భంగిమను
త్వరగా మార్చేసి ముఖం చాటేసేందుకు ప్రయత్నిస్తుంది.

చూపులకు కరకు దనంజోడించాలా?
కరుణరసపరిప్లావితం గావించాలా? అన్న ప్రశ్నలకు
జవాబులు వ్యక్తినిష్టంగానూ, సందర్భానికనుగుణంగా
సవరణలకు గురవుతూ వుంటాయి.


కోపతాపాలన్నీ కొండెక్కి కూర్చుని
విధ్వంసాలకు వేదికగామారేవి.
చూపులు కలవని కొండొకచో కొన్ని సందర్భాలు
మనకు దైనందిన జీవితాలలో ఎదురవుతుంటాయి.


అక్కడే మనం వాటిని సౌమనస్యంతో గెలుచుకునే
ప్రయత్నాలు ప్రారంభించాలి.
 చూపులుకలిస్తే ఏర్పడే శుభసందర్భాలనన్నింటినీ
మనసుపొరల్లో భద్రంగా దాచిపెట్టుకోవాలి.
 చూపులకు సుఖ ప్రసవమయేది సోయగాలసొంపులు కళ్ళెదుట
కదులుతూ సాగిపోయినప్పుడేకదా!!లేదంటే బాధలే
బ్రతుకుబాటలో అమవస చీకట్లను నింపుతూ వుంటాయి

కన్నీటిచారలు జలనిధులై మనలను చికాకులపాల్జేస్తాయి.
జీవితగమనాన్ని చిన్నాభిన్నం చేయడానికి శతవిధాలా యత్నం చేస్తాయి.
అందుకే చూపులు సారించడంలో తగు జాగ్రత్తలు తీసుకుని
మన జీవన యాత్రను సుఖ సంతోషాలనిలయంగా
తీర్చిదిద్దుకుని బ్రదుకు బాటను భద్రంగా సంస్కరించుకుని సాగాలి.!

-------------------------------------------------

   

No comments:

Post a Comment