ప్రణయాంజలి---
===============
ప్రేమను మనస్ఫూర్తిగా
నిర్వచించాలన్న ప్రయత్నం
స్నేహపూర్వకంగా
ప్రారంభించాను.
ఒక వికటాట్టహాసం
పొదలమాటునుంచి
పొగిలి ముందుకు దుమికింది.
ప్రేమను వర్ణించి తీరాలని
పట్టుబట్టి ప్రారంభించాను.
ప్రబంధ సుందరీ మణులంతా
పగలబడి నవ్వడం మొదలెట్టారు.
ఓరగా కాదుసుమా, కొరకొరా నావైపు
దృష్టిని సారించారు.మ్రాంపడిపోయాను.
ప్రేమను గాఢంగా హత్తుకుని
ప్రేమామృత వర్షపు రుచిని
ప్రపంచమంతటికీ విశదం
చేయాలని తీర్మానించుకున్నాను.
ఎదురుగా చెట్లఒమ్మలపై కూర్చున్న
చిలుకల జంట నావైపు తీక్షణంగా చూసి
ప్రక్కకు తప్పుకుని నన్ను తలదించుకునేలా చేసాయ్.
ఎన్ని కధలు,ఎన్ని నవలలు ఎన్ని కవితలు
ఎన్నెన్ని సినిమాలు అందులో నినదించిన
అనేకానేక చిత్రగీతాలు
ఇప్పుడూ అప్పుడూ ఎప్పుడూ
వెలువడుతూ శ్రవణపేయమై
కనులకు విందుగా పరిణమించాయి?
ఇవన్నె అన్ని భాషలలోనూ తనచుట్టూ
ప్రదక్షిణలు చేసాయన్న గర్వం తనలో
తొణికిసలాడడం గమనించాను!!
అది నీకే సాధ్యమమ్మా!! అంటూ
చిత్తగించవమ్మా,అంటూ చిన్ని ఆమాటతో
నిశ్సబ్దమా, నీదే ఈ రాజ్యం ఏలుకొమ్మని
ఓ చిన్ని సలహా పాటించి
నిష్క్రమించడం నావంతయింది.
=======================================
No comments:
Post a Comment