Monday, February 15, 2016

ఇప్పటిదాకా చెప్పినదానికన్నా భిన్నంగా
ఇంకేం చెప్పాలో నువ్వే ఆలోచించుకుని చెప్పు!

ఆకుల గలగలలో ప్రస్ఫుటమయే సంగీతమా?
సెలయేరు ప్రవాహపు సవ్వడిలో ప్రతిధ్వనించే
జలపాతపు హోరులో సొగసుగా నినదించే గాన ఝరులా?

అటువైపు శ్రద్ధగా గమనించు!
అన్నిసార్లు అలలు తలలు తాటించినా
చెక్కుచెదరని హృదయగతులతో ధీరత్వనితగా
స్తభ్ధుగా నిలడినా శిలా సౌందర్యమా?
అగాధాల అడుగున దాగి అణకువను ప్రదర్శించే
అమూల్యమైన వజ్ర వైఢూర్యాల పోహళింపులా?

ప్రతినిత్యం కార్యాలయాలలో ,కార్ఖానలలో
వాణిజ్యసముదాయాలలోనో స్వేదం వెలార్చక తప్పని నీవు
నీ ఇంటిదగ్గర బాహిరకంగా మౌనదీక్షను చేస్తున్న
వన సామ్రాజ్యాన్ని ఒక్కసారయినా మనసుపెట్టి
 సందర్శించావా?ఒక్క సారి గుండెమీద చెయ్యేసుకుని చెప్పు!!
ఆ అద్భుత సౌందర్యాన్ని అనుభవించలేకపోవడం
మన దురదృష్టం కాదంటావా?
ఆకులందున అణగిమణిగీ అందగా గొంతుకలను విప్పి
కోయిలమ్మలు ఆలపించే సుప్రభాత సంగీతాన్ని
చెవులారా ఆస్వాదించిన క్షణాలున్నాయి మనకు?
తరూ సమూహం వెనుక నిలబడి దోబూచులాడే
ఆదితుడిని మనం  పలకరించిన పాపాన పోయామా?

No comments:

Post a Comment