వలపు సౌధంలో నన్ను కూర్చోబెట్టి
మునివాకిట్లోకి వసంతాన్ని తెచ్చి
నా వొడికి చేర్చి మురుసుకునేలా చేసావు.
అనురాగామృత వర్షిణివై
ఆశలు చిగురించడానికి
ఇతోధికంగా దోహదం చేసావు.
చలిగాలులువీచే
హేమంతర్తువులోసైతం
నులివెచ్చని కౌగిలిలోకి తీసుకుని
శరత్కాలపు జ్యోత్స్నను కూదా దగ్గరకు దెచ్చి
చక్కిలిగింతలుగా నిలిపావు.
గ్రీష్మానికి ప్రవేశం నిరాకరించి
తనువుకు మలయమారుతపు స్పర్శను
కానుకగా అందించావు.
శిశిరాన్నిగూడా చీదరించుకోకుండా
చెలిమి చేసుకుని చైతన్యపు శిఖరంలా
విజయ దరహాసాన్నొలకబోసావు.
ఇంతకన్నా యెవ్వరైనా ఇంకా యే కోరుకుంటారు?
కలకాలం నీసన్నిధిలో కన్నులకాంతితో
కళకళలాడుతూ గడిచిపోతే చాలనుకోవడం తప్ప!!
మునివాకిట్లోకి వసంతాన్ని తెచ్చి
నా వొడికి చేర్చి మురుసుకునేలా చేసావు.
అనురాగామృత వర్షిణివై
ఆశలు చిగురించడానికి
ఇతోధికంగా దోహదం చేసావు.
చలిగాలులువీచే
హేమంతర్తువులోసైతం
నులివెచ్చని కౌగిలిలోకి తీసుకుని
శరత్కాలపు జ్యోత్స్నను కూదా దగ్గరకు దెచ్చి
చక్కిలిగింతలుగా నిలిపావు.
గ్రీష్మానికి ప్రవేశం నిరాకరించి
తనువుకు మలయమారుతపు స్పర్శను
కానుకగా అందించావు.
శిశిరాన్నిగూడా చీదరించుకోకుండా
చెలిమి చేసుకుని చైతన్యపు శిఖరంలా
విజయ దరహాసాన్నొలకబోసావు.
ఇంతకన్నా యెవ్వరైనా ఇంకా యే కోరుకుంటారు?
కలకాలం నీసన్నిధిలో కన్నులకాంతితో
కళకళలాడుతూ గడిచిపోతే చాలనుకోవడం తప్ప!!
==================================
No comments:
Post a Comment