Tuesday, February 16, 2016

ఒకసారి పచ్చదనం నిప్పచ్చరమైన
ఈ ఆకాశహర్మ్యాల గోపుర వైభవం వదిలి
ఎంతదూరమైనా సరే నడుచుకుంటూ
వనవిహారం చేద్దాం తరలిరండి.

ఒకసారి పచ్చదనం నిప్పచ్చరమైన
ఈ ఆకాశహర్మ్యాల గోపుర వైభవం వదిలి
ఎంతదూరమైనా సరే నడుచుకుంటూ
వనవిహారం చేద్దాం తరలిరండి.

ఇకముందుముందు గోడలకు వ్రేలాడే
కళాఖండాలనుండో ఎవరో ఒక
ప్రకృతి ప్రేమికుడు పరవశించి
బంధించిన చాయాచిత్రాలలో నో

వస్తు ప్రదర్శన శాలల్లో గాజు కుండీల్లో
మాత్రమే ఈ పచ్చదనం పరిమితమై పోయే
ప్రమాదం అతి సమీపంలో పొంచి వుంది
అందుకే కొంచం శ్రమైనాసరే చూసి
జన్మంతా మధురమైన ఆ హరిత స్వప్నాలతో
జీవితాంతం ఓ మంచి  జ్ఞాపకంగా హృదయ కుహరాల్లో
అమూల్యమైన ఆస్తిగా దీన్ని పోగుజేసుచుకుందాం రండి!

==================================

No comments:

Post a Comment