Sunday, February 14, 2016

ఎప్పుడో బాల్యంలో
వినిపించిన
 శ్రవణానందకరమైన
సంగీతమే ఇప్పటికీ
నాచెవులదగ్గర
ఆనందంగా వినబడుతూనే వుంది.
ఏడు దశాబ్దాలయినా
ఆ ఆకులగలగలగలలూ,
కోయిలమ్మలు ఆకులందున
అణగిమణిగీ వినిపించే
మోహనగీతాలూ,
ఒక్క పిసరుకూడా
మారిన దాఖలాల్లేవు.
ఒక్క మనిషిలోనే ఎన్నెన్నో
వికృతమైన,  విసర్జింపదగిన
పరిణామాల సందోహాలు.
================

No comments:

Post a Comment