Wednesday, February 3, 2016

ఒంటరితనం నీడలో
----------------------------


ఒంటరితనం ఒడిలో తలపెట్టుకుని
నీ అనుపానాలకోసం ఆశగా అన్వేషించాను
అవే ఆలోచనలో అప్పటిదాకా అతి భద్రంగా
 దాచుకున్న ఆనందాన్నీ కోల్పోయాను.

నాహృదయం తప్పకుండా నీజాడను వెదకి
పట్టుకుని తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాను.

కొన్నిరోజులలానే నిర్లిప్తంగా దొర్లిపోయాయి.
ఐనా నీ అనుంగు జాడ అస్సలు  లభించనేలేదు.
మనసంతా అగమ్యగోచరాల ఆలవాలమై నిలిచింది.

తలెత్తి ఆకాశంవైపు ఆశగా చూసాను.
నవ్వుతూన్న చంద్రుడు నావైపు
తనదృష్టిని మరల్చాడు.
పరుగెడుతున్న మబ్బులనీ
 పరాకుగా  నన్ను పరిశీలించాయి.
నాగతకాలపు జీవితంపు వైభవ చిహ్నంగానే ఒక శేషప్రశ్నగానే మిగిలిపోయావని అర్ధమయింది.
భూనభోంతరాళాలనన్నింటినీ అణువణువూ గాలించాను
శూన్యంలోంచి వినబడే కదలికల శబ్దమే నీ వని
నిశ్సబ్దంలోంచి నినదించే నిస్పృహేనేననీ
 ఇట్టే గ్రహించగలిగాను.
అవగతమయినదాన్ని మనసు పొరల్లో దాచుకుని
దిగంతాల దరికి దీనంగా జరిగి నిష్క్రమించాను..
=================================

No comments:

Post a Comment