Monday, February 1, 2016

మరో ప్రపంచపు బావుటా

=============
అవును మిత్రమా నీవన్నది అక్షరసత్యం
అతని పేరు సాహితీలోకంలో నినదించేదే అనునిత్యం.
అతడెవరనుకున్నావ్?
అక్షరాలను నాటి ఆరుగాలాల పాటూ శ్రమించి
అటకల్లో మూలుగుతున్న పుస్తకాలకు దుమ్ముదులిపి
నమ్మకమైన అమ్మకపు దారిని చూపినసంకల్పసిద్ధుడు.
బాల్యం నుదురుపై నవ్వులపువ్వులను పూయించిన తోటమాలి.
యువతను ఉర్రూతలూగిస్తూ సరయిన పంధాకు దారులు చూపిన పాంధుదు.
నడివయసుకు నడమంత్రపు సిరి పుస్తకపఠనమేనని
మంత్రించి మరో మంచి ప్రస్థానానికి మనస్సులను మరల్చిన మార్గ దర్శి.
వయసు నొసలుపై ముసలిరేఖలు ముద్రించిన తరుణాన
అసురసంధ్యలో సైతం ఆనందముందని కవిహ్ర్దయాలను
విశదీకరించి విడమరిచి చెప్పిన విజ్ఞాన ఖని.
అందుకేనేమో అక్షరాలకు అతనంటే అంతటి అవ్యాజానురాగం.
కుసుమించిన కుసుమపరాగం.
ఆబాలగోపాలానికి అతడొక అందివచ్చిన వరం.
నేలవిడిచి సాముచేయడానికి ఇచ్చగింపని సాహితీ కెరటం.
సౌశీ ల్యానికి సౌహార్ద సేతువు.
ఆకాశనవిహరిస్తూ దిగిరాను దిగిరాను భువికంటూ భీష్మించుకు
కూర్చున్న ద్రాక్షపండ్లను నేలకు దించి సాహిత్యపు మరంద మాధుర్యాన్ని
చదువరుల పంటిక్రిందకు చేర్చి తీయదనపు రుచులను పాఠక లోకానికి పరిచయం చేసిన సన్మంగళాకారుడు.
అతను అక్షరాలా సాహితీ సుగతుడు.
ఉషోదయపు హృదయగత భావాలను లోకాని కెరింగించిన సౌభాగ్యసంపద.
తోచటల్లేద్దని పదేపదే నసపెట్టే మనస్కులకు  తోపుడుబండి ద్వారా ఇంటిముంగిటనే  వారిని తిష్టవేయించే  మనోజ్ఞమైన   అమృతతుల్యమైన పానశాల
అతని ప్రపంచమంతా ఇప్పుడు పాడుబడిన పూర్వ వైభవాన్ని
పునరుజ్జీవింపతలపెట్టిన గ్రంధాలయోద్యపు ఉచ్చాస నిశ్వాసల ఊపిరి తిత్తు .

No comments:

Post a Comment