కరుణామృతవర్షిణీ
ఎక్కడ సంచరిస్తున్నావు తల్లీ?
చీకటిలో పొదలమాటున
తలదాచుకున్నావా?
ముఖ ద్వారానికి
జాగిలబడి కునికుతున్నావా?
అర్మోడ్పుకనులతో
అవనతవదనయై
అతిధి గదిలో
దు:ఖిస్తున్నావా?
ఎందుకట్లా అన్ని చోట్లా
వెదుకుతూ శ్రమపడతావ్?
ప్రతి ఇంట్లోనూనేనే పరవశిస్తూనేను
ప్రతి తోటలోనూ నా పరిమళమే
ఈ ధరణీతలమంతటా
విస్తరించిందీ నేనే!
పోతనామాత్యుని ప్రతి పద్యంలోనూ
ఇక నీ అన్వేషణను విరమించు!
రా వడి వడిగా వచ్చి నా ఒడిలో
వాలిపోయి హాయిగా సేదతీరు!
ఎక్కడ సంచరిస్తున్నావు తల్లీ?
చీకటిలో పొదలమాటున
తలదాచుకున్నావా?
ముఖ ద్వారానికి
జాగిలబడి కునికుతున్నావా?
అర్మోడ్పుకనులతో
అవనతవదనయై
అతిధి గదిలో
దు:ఖిస్తున్నావా?
ఎందుకట్లా అన్ని చోట్లా
వెదుకుతూ శ్రమపడతావ్?
ప్రతి ఇంట్లోనూనేనే పరవశిస్తూనేను
ప్రతి తోటలోనూ నా పరిమళమే
ఈ ధరణీతలమంతటా
విస్తరించిందీ నేనే!
పోతనామాత్యుని ప్రతి పద్యంలోనూ
ప్రతిబింబించిందికూడా నేనేకదా
శ్రీనాధుడిని అలుకపై కోప గించిందీ నేనేకదా!!ఇక నీ అన్వేషణను విరమించు!
రా వడి వడిగా వచ్చి నా ఒడిలో
వాలిపోయి హాయిగా సేదతీరు!
No comments:
Post a Comment