Saturday, February 13, 2016

స్వాప్నిక జగత్తులోంచి
ఒక్కుదుటున మేల్కాంచి
వాస్తవప్రపంచంలోకి
ఒక్కుదుటున
 నామనస్సులోంచి
బయటకు దూకాను.
అప్పటిదాకా ఆనందంగా
గడ్పిన మధుర
క్షణాలనన్నింటినీ
తన హృదయాంతరంగంలో
భద్రంగా దాచుకునీదృశ్యమైపోయింది.

జీవితం ఎన్నోమలుపులు తిరిగింది.
చేయి చేయికలుపుకుని
సుఖదు:ఖాలమధ్యన
స్రుక్కిసోలిపోయి
శూన్యంలోకి తొంగిచూస్తూ
మిగిలింది.
పూలబాటనంతటినీ
కంటకావృతం చేసి
 గంపగుత్తగా
ఇలా మార్చేసి మురిసింది.
ప్రేమ మనలను పెంచింది.
పెద్దవాళ్ళను చేసి
ఇరుహృదయాలను
కలిపి హాయిగా బ్రదకమని
ఆశీస్సులనందించి వెనుదిరిగి వెళ్ళింది.

అర్ధాంతరంగా వెల్లువగా వచ్చినిలిచిన
ఆపద కాలుబెట్టినదే తడవున
అంతా అస్తవ్యస్తమై
ఆపసోపాలు పడుతున్నది.

ఆలోచించినకొద్దీ అమృతధారలన్నీ
విషపుచుక్కలై
మనసుని వికలపరుస్తున్నాయి.
=============================

No comments:

Post a Comment