పితృ దేవోభవ======
=============================రావెల
----------------------------------------
గుణింతాలు చెప్పడానికి నేను తడబడుతుంటే
నీవు రూళ్ళకర్రతో భయపెడుతుంటే
ఎక్కడ దెబ్బలుపడి ఒళ్ళుహూనమవుతుందోనని
భయపడినందుకే జీవితంలో ప్రతి అడుగూ
లెక్కప్రకారమే పడుతూ నన్ను కాపాడుతూ వచ్చింది.
అబద్ధంచెప్పడానికి నోరు తెరిచినప్పుడల్లా
నువ్వు హూంకరిస్తుంటే ఎక్కడ వీపు చీరేస్తావోనని
భయభ్రాంతులకు గురైన క్షణాలనే గుర్తుంచుకుని
నేను త్రోవదప్పి ప్రవర్తించకుండా నలుగురిలో నాలుకగా
ప్రశంసార్హమై బ్రదుకు సజావుగా సాగేందుకు సాధ్య పడింది.
అప్పుచేయడం ఎంతతప్పో నువ్వు అప్పుజేసి బజారునపడిన వారి
హృదయ విదారకమైన బాధల గాధలు కధలుగా వర్ణిస్తుంటే
అవే మాజీవితంలో అవేపలుకులు ముళ్ళబాతనైనా పూలబాటలుగా మలిచి
బ్రదుకు నావనుసునాయాసంగా సంసారమనే మహాసాగరంలో ఈదుకుని
క్షేమంగా ఒడ్డుకుచేర్చగల ధైర్యాన్నందించి సహకరించింది.
ఇంతకన్నా యేసంతానానికైన అమూల్యంగా తండ్రి అందించగల
అత్యంత విలువైన ఎముంటుందని నేనంటే కాదనగల
ధీమా అక్షరాలా ఎవ్వరికుంటుంది?
---------------------------------------------------------------------

No comments:
Post a Comment