కాకులూ దూరని కారడవులూ, చీమలు దూరని చిట్టడవులూ అంటూ
కాశీ మజిలీ కధల్లోనో చదివిన గుర్తేగాని ప్రత్యక్షంగా
అలాంటి వూరును దర్శించుకుని అక్కడరెండేళ్ళపాటు ఉద్యోగ వృత్తిని
నెరవేర్చే అవకాశం ఓ మహానుభావుడైన పెద్ద అధికారి వలన కలిగింది!
ఆయన బాధకు కారణాలు వేరు అది ఇక్కడ అప్రస్తుతం గనుక
ప్రస్తావించాలన్న అవసరమూలేదనుకోండి.
అంతకుముందు బాగా అప్రతిష్టపాలయిన శాఖ అది.దాన్ని బాగుజేయాలన్న
సంకల్పమూ యేరికోరి నన్ను వో యస్[O.S] ను క్షేద్రాధికారులుగా నియమించారు.
యేదిముట్టుకోవాలన్నా ఎక్కడ యే విష సర్పాలున్నయో తెలియని పరిస్థితి.
అప్పటిదాకా నాలుగయిదేళ్ళపాటు కొత్త అప్పూ మంజూరు చేయడం ఆగిపోయింది.
శాఖ క్రమేపీ అపఖ్యాతి తో పాటు,నష్టాలనూ మూటగట్టుకోవడం మొదలయింది.
కింకర్తవ్యతా మూఢులంగా మొదలెట్టి క్రమేపీ రుణం,అంజూరు కొత్తవి చేయాలని సంకల్పించాము.
పై అధికారుల అనుమతులు అనుమానిస్తూనే ఇచ్చారు!
ఇక పాత బాకీలు వసూలు చేసుకుంటూ కొత్త రుణాలు మంజూరు మదలెట్టాము.
రూలు పుస్తకాన్ని తు/ చ/తప్పకుండా పాటించాలనీ నిర్ణయించుకుని శాఖా నిర్వహణాధికారికి విన్న వించాము. యేమో బాబూ మీరేం చేసినా కొద్ది రోజుల్లో పదవీ విరమణ చే బోతున్న నాకేం ప్రమాదం రాకుండా చూడం చాలు అన్నారు.
ప్రతి పంటల రుణం మంజూరు చేసే ముందు మొదస్తుగా పొలాలను పర్య్వవే క్షణం[!] చేయవలసిన అవసరముందని తెలుసును గనుక ఉదయాన్నే బయలుదేరి ఓ నాలుగు గంటలపాటు ఒక్కొక్క వూరిలో పూర్తిచేసుకుంటూ పదిహేనురోజుల్లో చాలావరకు పూర్తి చేయడం అయింది.. అప్పటిదాకా ప్రతి రుణమూ [మూకుమ్మడి హామీలతో ఇవ్వడం జరిగింది.అంటే ఒక గ్రూపులో ఐదుగురు వుంటే అందరూ పాతరుణాలు చెల్లిస్తేనే ఎవ్వరికయినా కొత్త రుణసదుపాయంకలిగేది--]అక్కడ ఎవ్వరు చెల్లించకపోయినా మా గ్రూపు అలా స్థబ్ధయై పోతుంది.ఇలా లాభం లేదని వారిని ముందు లోను చెల్లించినవారిని వ్య క్తిగత హామీతో అప్పునందించే అవకాశం కల్పించడంతో 60 నుంచి 75 శాతం దాకా రుణాల పునరుద్ధరణ కార్యక్రమం పూర్తయింది.అలా వారిలో శాఖపట్ల ఒక విశ్వాసాన్ని పునరుద్ధరించగలిగాము. అలాకొద్ది కొద్దిగా ఊపిరి పీల్చుకునే సమయానికి తనిఖీ బృందం విచ్చేయడం జరిగింది. .పూర్వ చరిత్ర అంత బాగాలేదుగనుక ఒక విజిలెన్స్ మేనేజరును మద్రాసునుంచి ప్రత్యేక శ్రద్ధతో తనిఖీకి పంపండం జరిగింది.ఆయనున్నన్నిరోజులూ, నిప్పులమీద నడిపించాడనే చెప్పుకోవాలి.మడిగట్టున్న మహానుభావుడాయన.తన కాఫీలు టిఫ న్లూ భోజనంకూడా తనజేబులోంచి ఇచ్చేవాడు.నిప్పులు కడిగిన మనిషి అనీ జాగ్రత్త అనీ ప్రధాన కార్యాలయమ్నుంచి సూచనలూ అందుకున్నాం .. ఆపసోపాలు పడుతూ శని ఆదివారాలుకూడా[ ఇంటివాళ్ళను
మనసులోనే తలుచుకుంటూ] కాలం గడిపాం-- రిపోర్ట్ ఇచ్చిన రోజునా మాకు చెమటలు పట్టాయనే చెప్పుకోవచ్చు.నేను ఊరు దాటి పక్క పట్టణానికి వెల్లేదాకా సీల్డ్ కవరులో పె ట్టి యిచ్చిన[ఆనవాయితీ ఇది] రిపోర్టును చూడొద్దని చె ప్పారు. ఒకవేళ చూసినట్లు తను పసి గడితే రిపోర్టును మార్చేస్తాననీ హెచ్చరించాడు..
అక్కడో పాత శివాలయం వుండేది. ప్రతి సోమ వారం . అక్కడపూజ స్వయంగా చేసుకుని
అభిషేకంకూడా చేసుకునే వాడు. అక్కడ దొరికే అన్నం తినే అదృష్టంకూడా తక్కువే నని చెప్పక తప్పదు--డబ్బులు ఖర్చుపెట్టగలిగినా యేమీ లభ్యం కాని దురవస్థ--కుటుంబ సమేతంగా అక్కడ వుండలేని దుస్థితి..తీరా చూస్తే అప్పటిదా కా శాఖ నోచుకోని విధంగా బాగా శాఖ నడుస్తున్నదనికితాబు.వినుకొండనుంచో నరసరావుపేటనుంచోఎవరైనా ఫోన్ చేసినా వస్తుందన్న నమ్మకంలేదు.వచ్చిందంటే మన పుణ్యం పుచ్చినట్లే లెక్క .ఆదగ్గరలో చేజెర్ల కపోతే శ్వర స్వామి వారి దేవాలయం వుంది.
అక్కడ ఒక రాత్రి నిద్రిస్తే అనుకున్న విధంగా బదిలీలు,పదోన్నతులు] లభిస్తాయని విశ్వాసం.
ఇక మేము అక్కడ రెండుసార్లు ఆ వ్రతదీక్షనూ పూర్తిచేసుకున్నాం.ఇంతకీ ఆయనగారు అప్పటిదాక
అసంతృ ప్తిని మాత్రమే చూరగొన్న శాఖకు రెండు స్థాయిలు పెంచి బాగా నడుస్తున్నదని కితాబు ఇచ్చారు.ఆ రిపోర్ట్ ధర్మమా అంటూ మా మేనేజర్ గారికి తనవూరికి బదిలీ , అనూహ్యంగా నాకు పదోన్నతీ ఒక దాని వెంట లభించాయి.
అక్క డ సాయత్రం వేళ షికారుకెల్తే పసుపు కొమ్ములను ఉడకపెడుతుంటే వచ్చే సువాసన అనిర్వచనీయం..
ఆ వూరే నరసరావుపేటలో స్థిరపడి డాక్టర్ గా అమిత ఖ్యాతినార్జించిన అన్నపూర్ణమ్మ[ స్త్రీ ప్రసూతి వైద్యులు ] గారి పుట్టినూరుకూడా!
ఆవూరే ఇప్పుడు సినీ గీతావరణంలో విశేష ఖ్యాతినార్జించిన శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారి స్వగ్రామంకావడం విచిత్రం, విశేషంకూడా!!
===================================

No comments:
Post a Comment