ఒక నిరీక్షణలో
ఆనందమో,ఆందోళనో
పెనవేసుకుని పోయి వుంటుది.
నిరీక్షించిన మనిషి
కంటపడినప్పుడేమో ఆనందం
తన బిగికౌగిలో మనసును
ఉక్కిరి బిక్కిరి చేసి
శ్వాసిస్తుంది.
ఎదురుతెన్నులోనూ
అంత ఆనందముందని
తెలుసుకోవడంలోనే
తెల్లవారుతున్నది
హృదయాకాశం.
ఆనందమో,ఆందోళనో
పెనవేసుకుని పోయి వుంటుది.
నిరీక్షించిన మనిషి
కంటపడినప్పుడేమో ఆనందం
తన బిగికౌగిలో మనసును
ఉక్కిరి బిక్కిరి చేసి
శ్వాసిస్తుంది.
ఎదురుతెన్నులోనూ
అంత ఆనందముందని
తెలుసుకోవడంలోనే
తెల్లవారుతున్నది
హృదయాకాశం.
No comments:
Post a Comment