Saturday, February 13, 2016

నన్ను పూలపానుపుపై
పవళింపజేసి
తనొక శిశిరపత్రంలా
నేలకు రాలిపడి మెల మెల్లగా
అంతర్ధానమయింది.
జీవితాంతం శోకసంద్రంలో
మునిగి తేలుతుండమని
నెమ్మదిగా శాసించి
భర్త మార్గంలోంచి
ప్రక్కకు తప్పుకుని
భక్తి మార్గంలో
దీర్ఘంగా శ్వాసించింది.

రాతిగుండెను తడుముకుంటూ
రానికనీకోసం అంటూ
రహస్య వేషంలో ఒంటరిగా
రాజమార్గంలోరాణిలా
నడుచుకుంటూ  సాగిపోయింది.
=======================

No comments:

Post a Comment