సదసత్సంశయం
-------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
అతడెప్పుడయినా
నాకెదురైతే ప్రేమతో
పలుకరిస్తాడంటారా?
లేదా పెడసరంగాముఖం
ప్రక్కకు తిప్పుకుని
వుడాయిస్తాడంటారా?
అతడు తనహృదయాన్ని]ఆవిష్కరిస్తూ
సంభాషణసాగిస్తాడా?
లేదా,మౌనాన్ని ముద్దాడుకుంటూ
మౌనంగా నిష్క్రమిస్తాడా?
ఇంతకాలం నానిరీక్షణంతా
అతనికోసమేనని ఎలా రుజువుచేయాలి?
అదివరకులా కొరకొరా జూస్తూ గొణకడంకాకుండా
ప్రసన్న వదనంతో తను నన్ను దగ్గరకు స్వీకరిస్తాడా?
మనసువిప్పి హాయిగా మాట్లాడుకునే నేర్పును అతను ఇప్పటికైనా
సంతరించుకోగలిగి వుంటాడా?
అతని సంగతి సరే అతను ఈక్కడయినా ఎప్పుడయినా ఎదురుపడితే
ఆసమయానికి తగు మాటలాడడం నా వల్లనవుతుందా?
లేదా మొగ్గలా ముడుచుకుపోయి పేదవిని విప్పలేని సిగ్గుతో
ముడుచుకుపోయి కోపంతెప్పిస్తానా?
మౌనాన్నే సిం హాసనమెక్కించి మెదలకుండా అతన్ని
తనివితీరా కన్నులపండుగగా చూస్తూ మిగిలిపోతానా?
[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో]
================================

No comments:
Post a Comment