నిన్నటిదాకా వసంత వాయువుల వీవనలతో
పులకించి పరవశించినట్లనిపించిన ఆకాశం
ఒక్క సారిగా శిశిర శోభను గట్టిగా కౌగలించుకుని
వదలనుపొమ్మంటూ ప్రకృతిమాతను సైతం
హెచ్చరిస్తున్నట్లనిపిస్తుంది.చిరాకునూ ప్రదర్శిస్తున్నది.
ఒక్కసారి ఇంటావిడ అసువులుబాసిందని తెలియగానే
బంధుమిత్రగణమంతా శోకసముద్రంలో ఈదడం మొదలెట్టారు.
కొంతకాలం తర్వాత మళ్ళీ మామూలు ప్రపంచంలోకి దూరిపోవడానికి
శతవిధాలా శ్రమపడుతూ స్వేదాన్ని వెలారుస్తున్నారు.
తదనంతరం గోడమీదన కళకళలాడుతూ ఓ చిత్రపటం వెలిసింది.
పండుగలకూ పబ్బాలకూ పరిమళ భరితమైన పూల మాలతో
పుణ్యంగట్టుకుని పురావైభవాన్ని ఏడాదికొకసారి మనో ఫలకాలపై
ముద్రణకు గురిచేస్తూ -- మెరుపుల మరకలతో తటిల్లతగామారి
మురిసి పోతూ, అదృశ్యమైపోతూ అంతర్ధానమవుతున్నది..
====================================================
[ఒక చైనీస్ కవిత చదివిననేపధ్యంలో]

No comments:
Post a Comment