Saturday, February 27, 2016

అపజయాలతో అట్టుడికిపోతున్న  మనసుకు
ఆందోళనలతో ఉరుకెత్తించగల ఓ మనిషి శవం కావాలి!!
ప్రభుత్వాన్ని పెదవులమీద తిట్టుకుంటూనే
చట్ట సభల్లో చెత్త చెత్తగా వాగడానికి కూడా సుమా!
అవసరమైనా అనవసరమైనా జనంలో బాగుచేస్తున్న ప్రభుత్వాన్ని
ప్రజలకు దూరంచేయగల కులాల సంకుల సమరమో
మతాల మారణహోమాలతో ముడిపెట్టగలిని ఓ చావుకావాలి.

దేవాలయాలుగా నిర్మితమైన విద్యాలయాలను భూతాల నిలయంగా
సులువుగా చిత్రీకరించడానికి వీలయిన శవమొకటి తక్షణం కావాలి!

మాకుతోడుగా విదేశీ సహాయ సహకారాలుంటాయని
ఎర్రసైన్యం పదేపదే చెపుతున్నది--పోరుబాటతొక్కాలని
పొగిలి పొగిలి ఏడుస్తూ ఓ శవం దొరికే సందర్భంకోసం
గోతిదగ్గర కాపుగాచే నక్కల్లా ఎదురుచూస్తున్నాం అందరం ఆశగా

ఎంతటి సమస్యకైన పరిష్కరం చూపే సత్తా మాకెలాగూలేదు
అంతగా మీరు ద్వేషించగల చేతగాని చవటలం మేము.మమ్మల్ను నమ్మంది.
శవరాజకీయంకోసం హృదయం ఘోషిస్తున్నది.
దేశమంతటా మా పార్టీలు తుడిచిపెట్టుకు పోయేదాకా
మా ప్రయత్నాలనిలా కొనసాగిస్తూనే వుంటామని తెలియజేస్తున్నాం.
మామనవి నాలకించండి !! మాకు అతిత్వరగా ఓ మనిషి శవం కావాలి.
===================================

No comments:

Post a Comment