ఎన్నో తుఫాను గాలులు వీచినా
స్థిరంగా నిలబడగలిగిన మనం
కాలం విసిరిన గాలానికి
చిక్కకుండా తప్పించుకోలేమా?
ఎన్నో సునామీలను కనులారా గాంచి
తొట్రుపడకుండా నిలదొక్కుగోగలిగిన మనం
విసురుగా వీచే ఝంఝా మారుతాన్ని
ఎదిరించి హాయిగా నిలబడలేమా?
జరయు రుజయు పెట్టిన బాధలన్నింటినీ
క్రమేణా దిగమ్రింగుకు జీవనం సాగిస్తున్న మనం
ఎవరో యేదో అన్నారని శిశిరపత్రంలా రాలిపోతామా?
ఉవ్వెత్తున ఎగసిపడే అలల ధాటికి
కొద్ది క్షణాలపాటు తలవంచుకుని
తప్పించుకుని ఊపిరి పీల్చుకోగలిగిన మనమే
క్షణికావేశాలకు లోనుకాకుండా , నిబ్బరంగా ఉండలేమా?
స్థిరంగా నిలబడగలిగిన మనం
కాలం విసిరిన గాలానికి
చిక్కకుండా తప్పించుకోలేమా?
ఎన్నో సునామీలను కనులారా గాంచి
తొట్రుపడకుండా నిలదొక్కుగోగలిగిన మనం
విసురుగా వీచే ఝంఝా మారుతాన్ని
ఎదిరించి హాయిగా నిలబడలేమా?
జరయు రుజయు పెట్టిన బాధలన్నింటినీ
క్రమేణా దిగమ్రింగుకు జీవనం సాగిస్తున్న మనం
ఎవరో యేదో అన్నారని శిశిరపత్రంలా రాలిపోతామా?
ఉవ్వెత్తున ఎగసిపడే అలల ధాటికి
కొద్ది క్షణాలపాటు తలవంచుకుని
తప్పించుకుని ఊపిరి పీల్చుకోగలిగిన మనమే
క్షణికావేశాలకు లోనుకాకుండా , నిబ్బరంగా ఉండలేమా?
========================
No comments:
Post a Comment