వివాహాత్పూర్వం
అంత గాఢంగా
ప్రేమించుకున్నామోలేదోగాని
ఆతర్వాతంతా
ప్రేమించుకుంటూనే గడిపాము.
ప్రేమికుల దినోత్సవాలు
మనదేశంలోకి అడుగిడకముందే
ప్రేమకు ఇదే అర్ధమనుకునేలా
నిర్వచనమై నిలబడ్డాము.
ఇప్పుడు ఈ దినోత్సవాలను
ఉత్సాహంగా గడపుకుందా మనుకుంటే
నువ్వులేవు--నీ ప్రేమా దర్శనమిచ్చే వీలులేదు.
ఎక్కడో దిగంతాలదరిని నీవు
ఇక్కడన భువన భవనంలో
కుడితిలోబడ్డ ఎలుకలా నేను
బురదలో కూరుకుపోయిన పాదాలతో
ముoదుకడుగు వేయలేని ముభావంతో----
అంత గాఢంగా
ప్రేమించుకున్నామోలేదోగాని
ఆతర్వాతంతా
ప్రేమించుకుంటూనే గడిపాము.
ప్రేమికుల దినోత్సవాలు
మనదేశంలోకి అడుగిడకముందే
ప్రేమకు ఇదే అర్ధమనుకునేలా
నిర్వచనమై నిలబడ్డాము.
ఇప్పుడు ఈ దినోత్సవాలను
ఉత్సాహంగా గడపుకుందా మనుకుంటే
నువ్వులేవు--నీ ప్రేమా దర్శనమిచ్చే వీలులేదు.
ఎక్కడో దిగంతాలదరిని నీవు
ఇక్కడన భువన భవనంలో
కుడితిలోబడ్డ ఎలుకలా నేను
బురదలో కూరుకుపోయిన పాదాలతో
ముoదుకడుగు వేయలేని ముభావంతో----
=================================
No comments:
Post a Comment