Friday, February 5, 2016

అంతర్వ్యూహం
---------------రావెల
===================

మృత్యువుతో   ముఖాముఖి కోసం
ముందస్తు ప్రశ్నావళిని సిద్ధం చేసుకోవాలన్న ప్రణాళికలేం లేవు.
అసలీ ఆలోచనారావడమే తడవుగా
అంతరoగంలో ఆలోచనల మధనం మొదలయింది.
అగ్నిపరీక్షకు సీద్ధమయిన సీతనుజూసి
ఆందోళన పడిన ప్రజావాహినిలా
కల్లోలాంతరoగంతో కకావికలైంది మనసు.

అకాలమృత్యు హరణానానికీ
మార్గాలుంటే వివరించమనీ,
ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను సైతం
తల్లిదండ్రులకూ దూరంగా నిష్క్రమింపజేయడం
ఎంతవరకు సబబో పునరాలోచన చేయాలని
విజ్ఞప్తిచేద్దామనిన్నూ ఆలోచన అంకురించింది!
యవ్వనంకడుగిడి ఉవ్వెత్తున ఎగసిపడే
ఉజ్జ్వల తరంగాలను సైతం దిగంతాలదరికి
తీసుకెళ్ళి అదృశ్యం గావించడంలో
అంతరార్ధమేమిటని ?అదసలు ధర్మమేనా? అని అడగాలని,
విశ్రాంత జీవనంలో సుఖసంతోషాలతో తొణికిసలాడాలనీ
శేషజీవితం  సుఖప్రదంగాసాగాలనే
కోరుకునే దశ లో  ఇద్దరిలో ఒకరిని దారుణంగా
కాజేసి తీసుకెళ్ళడం ఎంతవరకు న్యాయమని?
 గద్దించాలనీభావించాను. ఇలా ఎందరినో కరకుదనం ఉప్పతిల్లజేస్తూ
కన్నీటిసంద్రాలలో ముంచేయకుండా యేవైనా
నియంత్రణ చర్యలు చేపట్టడంలేదెందుకని
ప్రశ్నించాలని తహతపడుతున్నాను.

నేను ఇంటి ముఖ ద్వారం తెరవగానే
ఓ సుందరమై సమ్మోనరూపం ఒకటి ఆశ్చర్యంగా
నాకన్నులెదుట సాక్షాత్కరించి
నన్ను సంభ్రమానికి గురిచేసింది.
వెదకు బోతున్న తీగ కాలికి తగిలినంత సంతోషంకలిగింది.

నీ అంతరంగం మధనకు గురవుతున్నదనీ
కకావికలయ్యిపోతున్న నీ మంచి తనాన్ని ఇట్టే గ్రహించాను.

గ్రీష్మంలోనే తుఫానులూ అకాలవర్షాలు ఎందుకొస్తున్నాయని
ఎప్పుడయినా ఎవరితోనయిన సంప్రదించగలిగావా?
ధర్మం దారితప్పి ప్రవర్తించడంలో
అంతరార్ధమేమిటని గ్రహించావా?
న్యాయంకబోదిలా మారి తీర్పులివ్వడం ఎంతవరకు
సబబని ఎప్పుడయినా నిన్ను నీ వు ప్రశ్నించగలిగావా?
ప్రకృతి ఎందుకిలా మనుష జాతికి విరుద్ధంగా సంచరిస్తుoదో
అర్ధం చేసుకునే ప్రయత్నం జేసావా?

వీటినన్నింటికీ జవాబులు నీ దగ్గరే వున్నాయని
ఇంకొకసారి నీకు గుర్తు చేద్దామని నీ ఇంటి తలుపు తట్టాను.

ఎదురు ప్రశ్నలు వేస్తున్ననని బిత్తరపోకు సుమా,  మిత్రమా?
ప్రకృతిని అడుగడునా శత్రువుగా చూస్తూ నీ మానవజాతి
ఇబ్బందులపాల్జేస్తున్నప్పుడు మీ సుఖాలకోసం
ప్రకృతిమాతతో పరాచికాలాడుతూ శుష్క  ప్రయత్నాలు కొనసాగిస్తున్నంత కాలం
తన అనుంగు నెచ్చెలిగా ఇలాంటి చర్యలే సంభవిస్తూ
 వుంటాయని తెలియ జెప్పడమే నా నిశ్చితాభిప్రాయం --
ముందు ఇంటగెలిచి రచ్చకెక్కి ప్రశ్నించు మరచిపోకు !
ఈ ప్రశ్నలకు నీవిచ్చే జవాబుతో యేకీభవించగలిగితే
నేను అనుసరిస్తున్న మార్గమెందుకో వివరిస్తాను
మరో సమావేశంలో సరేనా? అని నా కళ్ళెదుటే
ఆ స్వరూపం    అదృశ్యమై పోయింది.
==================================4-2-16 



No comments:

Post a Comment