దిశానిర్దేశం
----------------------రావెల
వారానికొక్క తూరైనా
మన తప్పొప్పుల పట్టికను
శ్రద్ధగా చదువుతూ
మూల్యాంకనం చేసుకోవాలని
చెవిదగ్గర ఇల్లుకట్టుకుని
మరీ చెప్పుకొచ్చాను?
నువ్వు ఒక్కసారయినా
నా మాటలను ఆలకించిన
పాపాన పోయావా?
పైన కంటికి కనబడే
తీపిపొరలనే నమ్ముకున్నావు
చేదు పొరలుంటాయన్న విషయాన్నే
మరిచిపోయి ప్రవర్తించాము!
అంతరాత్మ క్షోభ పడడం
అంత మంచి కారణంకాదనీ
చెప్పుకుంటూ వచ్చాను.
ఇప్పుడెంతగా అంతరంగ మధనంతో
ఉక్కిరిబిక్కిరై ఊపిరాడకుండా పోతున్నాం!
అశ్రుతాత్మను సంబాళించుకునే దిక్కుతోచక
దిగాలుపడి దీనవదనులమై కూర్చున్నాం.
కడుపునిండా నవ్వుకుని ఎన్నాళ్ళయిందో తెలుసా?
ఆత్మీయతానురాగాలు అదృశ్యమై పోతున్న ఈవేళ
అంతరంగాన సంఘర్షణలతో అలమటించి పోవడం
నిద్రాహారాలులేని రాత్రులతో చెలిమి చెయ్యవలసిరావడం
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వగచడం--మానసిక
ప్రశాంతతనుకోల్పోయేందుకేగదా
గమనించు! ఇప్పటికైనా మన తప్పొప్పుల పట్టికను మనమే
మూల్యాంకనం చేసుకుని దిశానిర్దేశం చేసుకుందాo!! రా, తరలిరా!
=========================================
----------------------రావెల
వారానికొక్క తూరైనా
మన తప్పొప్పుల పట్టికను
శ్రద్ధగా చదువుతూ
మూల్యాంకనం చేసుకోవాలని
చెవిదగ్గర ఇల్లుకట్టుకుని
మరీ చెప్పుకొచ్చాను?
నువ్వు ఒక్కసారయినా
నా మాటలను ఆలకించిన
పాపాన పోయావా?
పైన కంటికి కనబడే
తీపిపొరలనే నమ్ముకున్నావు
చేదు పొరలుంటాయన్న విషయాన్నే
మరిచిపోయి ప్రవర్తించాము!
అంతరాత్మ క్షోభ పడడం
అంత మంచి కారణంకాదనీ
చెప్పుకుంటూ వచ్చాను.
ఇప్పుడెంతగా అంతరంగ మధనంతో
ఉక్కిరిబిక్కిరై ఊపిరాడకుండా పోతున్నాం!
అశ్రుతాత్మను సంబాళించుకునే దిక్కుతోచక
దిగాలుపడి దీనవదనులమై కూర్చున్నాం.
కడుపునిండా నవ్వుకుని ఎన్నాళ్ళయిందో తెలుసా?
ఆత్మీయతానురాగాలు అదృశ్యమై పోతున్న ఈవేళ
అంతరంగాన సంఘర్షణలతో అలమటించి పోవడం
నిద్రాహారాలులేని రాత్రులతో చెలిమి చెయ్యవలసిరావడం
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వగచడం--మానసిక
ప్రశాంతతనుకోల్పోయేందుకేగదా
గమనించు! ఇప్పటికైనా మన తప్పొప్పుల పట్టికను మనమే
మూల్యాంకనం చేసుకుని దిశానిర్దేశం చేసుకుందాo!! రా, తరలిరా!
=========================================
No comments:
Post a Comment