రెండు అనుసృజన కవితలు
======================
చూసావా?
ఈకన్నీళ్ళు ఎంతద్రోహులో--
బిందువులనింటినీ సింధువుల్లా చేర్చుకుని
నామనోభావాలనన్నింటినీ
తమ అగాధాల్లో .జలాశయాల్లా నిలుపుకుంటూ
అనూహ్యంగా అప్పుడప్పుడూ వాటిని
అ శ్రు బిందువులుగా మార్చి
నేలకు రాలుస్తూ
నన్ను అనవరతం దు:ఖస్నాతనుచేసి
ఏడిపిస్తూ వేధిస్తున్నాయ్.
ప్రేమా,భయం,తిరస్కార భావమా!
ఇంకసెలవుసుమా!
మీ ప్రవర్తనతో పూర్తిగా విసుగెత్తిపోయాను!!
ఇక మీపని ఐపోయింది చల్లగా జారుకోoడి.
---------------------------------------
[2]
నేను విడిచిన గాలంతా
అలలు అలలుగా ఎగిరి
ఎదురుగా వున్న కాన్వాసుపై
నీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నది..
ప్రక్కనున్న కిటికీని ఆశ్రయించగా
శీతల స్పర్శే తగులు తున్నది..
ఎక్కడున్నావు నీ వు?--నీ వేమంటావిప్పుడు?
-----ఆంగ్లం:Neha kumari తెలుగుసేత---సుపాణి.
======================
చూసావా?
ఈకన్నీళ్ళు ఎంతద్రోహులో--
బిందువులనింటినీ సింధువుల్లా చేర్చుకుని
నామనోభావాలనన్నింటినీ
తమ అగాధాల్లో .జలాశయాల్లా నిలుపుకుంటూ
అనూహ్యంగా అప్పుడప్పుడూ వాటిని
అ శ్రు బిందువులుగా మార్చి
నేలకు రాలుస్తూ
నన్ను అనవరతం దు:ఖస్నాతనుచేసి
ఏడిపిస్తూ వేధిస్తున్నాయ్.
ప్రేమా,భయం,తిరస్కార భావమా!
ఇంకసెలవుసుమా!
మీ ప్రవర్తనతో పూర్తిగా విసుగెత్తిపోయాను!!
ఇక మీపని ఐపోయింది చల్లగా జారుకోoడి.
---------------------------------------
[2]
నేను విడిచిన గాలంతా
అలలు అలలుగా ఎగిరి
ఎదురుగా వున్న కాన్వాసుపై
నీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నది..
ప్రక్కనున్న కిటికీని ఆశ్రయించగా
శీతల స్పర్శే తగులు తున్నది..
ఎక్కడున్నావు నీ వు?--నీ వేమంటావిప్పుడు?
-----ఆంగ్లం:Neha kumari తెలుగుసేత---సుపాణి.
No comments:
Post a Comment