నిర్వాసితగానం
-------------------రావెల
ఈ ధరణీతలం నుండి
నిర్వాసితులమైన జాబితాలో
మనం లేమన్న తృప్తి ఒక్కటే
శాశ్వతంగా మిగిలివున్నదిలాగుంది.
పచ్చనిపంటపొలాలమధ్యనుంచి
పసిమి చాయలుకనుచూపుమేరల్లో
కనబడనంత దూరానికి
విసిరివేయబడ్డ అదృష్ట హీనులెందరో--
జనారణ్యంలో స్వేచ్ఛగా ఊపిరందక
అక్కడ ఉక్కిరిబిక్కిరౌతున్నారు గమనించండి.
ఆకుపచ్చని ఆకాశం మనకు అండగా నిలిచినంతకాలం
మనకు ఉచ్చ్వాస నిశ్వాసాల ఊసులకేం భయంలేదు.
నేలను నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నవారే
బలవంతంగా బహిష్కరింపబడి అగమ్యగోచరంగా
బ్రదుకులను వెళ్ళదీస్తూ ఖిన్నవదనులై కించపడుతున్నారు.
భావికాలం వారి జీవితాల్లోకి వెలుగులనెంతగా
ప్రసరిస్తాయో తెలియదుగాని అనూహ్యమైన
అంధకార బంధురమై
అలమటింపజేయడం ఖాయమని తోస్తున్నది.
శేషజీవితమంతా కరెన్సీ కాగితం
పడవలమీదనే సాగాలని రాసుందేమో!
అక్కడ బాల్యావస్థలోవున్నవారు
యవ్వనానికి చేరువయే యోచనలేదు.
యవ్వనంలోజీవించేవారు ముదిమిని
ముద్దాడడమే మోజుగామిగిలే వీలుంది.
కరుగుతున్న కలలకు కన్నీటి
తడితగులుతుందన్న నమ్మకం కనరాదు.
అందరూ ఇక అశ్రు రహితమైన జీవనం
సాగించడమే శాశ్వతమయేలాగుంది.
===========================
-------------------రావెల
ఈ ధరణీతలం నుండి
నిర్వాసితులమైన జాబితాలో
మనం లేమన్న తృప్తి ఒక్కటే
శాశ్వతంగా మిగిలివున్నదిలాగుంది.
పచ్చనిపంటపొలాలమధ్యనుంచి
పసిమి చాయలుకనుచూపుమేరల్లో
కనబడనంత దూరానికి
విసిరివేయబడ్డ అదృష్ట హీనులెందరో--
జనారణ్యంలో స్వేచ్ఛగా ఊపిరందక
అక్కడ ఉక్కిరిబిక్కిరౌతున్నారు గమనించండి.
ఆకుపచ్చని ఆకాశం మనకు అండగా నిలిచినంతకాలం
మనకు ఉచ్చ్వాస నిశ్వాసాల ఊసులకేం భయంలేదు.
నేలను నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నవారే
బలవంతంగా బహిష్కరింపబడి అగమ్యగోచరంగా
బ్రదుకులను వెళ్ళదీస్తూ ఖిన్నవదనులై కించపడుతున్నారు.
భావికాలం వారి జీవితాల్లోకి వెలుగులనెంతగా
ప్రసరిస్తాయో తెలియదుగాని అనూహ్యమైన
అంధకార బంధురమై
అలమటింపజేయడం ఖాయమని తోస్తున్నది.
శేషజీవితమంతా కరెన్సీ కాగితం
పడవలమీదనే సాగాలని రాసుందేమో!
అక్కడ బాల్యావస్థలోవున్నవారు
యవ్వనానికి చేరువయే యోచనలేదు.
యవ్వనంలోజీవించేవారు ముదిమిని
ముద్దాడడమే మోజుగామిగిలే వీలుంది.
కరుగుతున్న కలలకు కన్నీటి
తడితగులుతుందన్న నమ్మకం కనరాదు.
అందరూ ఇక అశ్రు రహితమైన జీవనం
సాగించడమే శాశ్వతమయేలాగుంది.
===========================
No comments:
Post a Comment