హేతుబద్ధంగా--
================రావెల
ఇవ్వాళయినా నేనోకవితను రాయాలి
కనీసం పదికాగితాలను
ఖరాబుచేసైనా సరే ఒక
కవితను వెలువరించగలగాలి--
అదృష్టహీనులైన అధోజగత్సోదరులను
గూర్చి కవితను వ్రాసి మరో
మహాప్రస్థానపు కవికి అపురూప
కానుకగా ఇవ్వాలని తీర్మనించుకున్నాను--
శ్రమైక జీవనపు సౌందర్యం మీద కవితను
ప్రారంభించగానే ఎదురింటి పూరిపాకలో వుండే
గౌరమ్మను అర్ధరాత్రి దాటాక తాగొచ్చి దారుణంగా
తన్నుతున్న మగడి దెబ్బలకు తాళలేక
ఆమే చేసే ఆర్త నాదాలు నాకలాన్ని కట్టిపడేసి
కన్నీళ్ళపర్యంతమయేలా చేసింది--
ప్రణయ గీతమొకటిరాద్దామ ద్దామకోగానే కొత్తగా ప్రక్క యింట్లోకి
అద్దెకు దిగిన నూతన దంపతులమధ్య పొరపొచ్చాలు పొడసూపి
విడాకులదాకా వెళ్ళేలా వుందని ఇంటావిడ చెవిగట్టుకుచెపితే
నా కలంలో ప్రళయం ధారాపాతంగా ప్రవహించడం మొదలయింది..
ఇక అన్నింటిలోనూ ఆబాలగోపాలాన్ని కానీ ఖర్చులేకుండా
అలరించేది ఒక్క భక్తి మార్గమేగనుక ఏదో ఒక దేవుడిమీద
భక్తి గీతమల్లుదామని కృత శ్చయుడనవగానే టీవీ లో
స్వామి వారి ఉపన్యాసం ఎందుకో కంటగింపు కలిగించి
భక్తి ప్రపత్తులపైనే వైరాగ్యాన్ని ప్రసాదించింది--
ఏదయినా పల్లెలను పల్లీయులను ప్రభావితంచేయగల
జానపద గీతం గిలుకుదామనుకుంటే--
పొలాలుకోల్పోయి తల్లడిల్లిపోతున్న అనాధ లైన కర్షకుల
ఆర్తనాదం నన్ను నాగరికుడిగానలిపేసి
నడుంకూల్చేలాచేసి, కృంగదీసింది--
ఏదయినా కళకు సేవజేయడం-- సాధన ద్వారానో లేదా
ఆ కళకు దూరంగా వుంటూ ఔత్సాహికులను ప్రోత్సహించడమేమేలని
తీర్మానించి తిక్క కుదుర్చుకుని కిమ్మిన్నాస్తిగా కలం ముడిచి
-------------------------------------------------------------------------

No comments:
Post a Comment