Tuesday, March 15, 2016

కంతుని పూజసేయుదము కాంచనపుష్పచయంబులీవు,సే
మంతులు నీవు నీవు విరజాజులు పొన్నలునీవు నీవు వా
సంతిక,లీవు గొజ్జలు చంపకమంజరులీవు దెమ్ము మా
వంతు సరోరుహంబులని వావిరి గోయదొడంగి రందరున్!!

పూబోడులంతా పూజను చేయపూలు తెచ్చేందుకు ఎలా పనిని
తమలో తాము పంచుకున్నారో చూడడి--అలా పలురకాలతో--
 పుష్పాలంకృతుడైనభగవంతుని[ప్రేమైక దైవస్వరూపాన్ని
ప్రణయాధిదేవత సౌదర్య విలాసమెంత
హృదయంగమoగా వుంటుందో----ఊహించనలవిగాదుగదా!!

[అనంతా మాత్యుని---భోజరాజీయం నుండి--]

No comments:

Post a Comment