Saturday, March 19, 2016

ఒక మెలకువకోసం
ఎన్నెన్ని చిక్కటి చీకటి రాత్రులను
అందరాని చందమామకు ఎరగాచూపెడుతూ
వాటినలా బుజ్జగిస్తున్నట్టు నటిస్తూనే
నిర్ణిద్రా గానపు జోలపాటలతో
 మభ్యపెడుతూ--- పరవశింపజేసానో--





ఒక నదీమూలాన్ని గుర్తెరగడంకోసం
ఎన్ని ఎడారు భూములను,బంజరు పొలాలను
వరుసక్రమంలో  దాటుకుంటూ అడుగడుగునా వాటి
భుజాలను తట్టి ప్రోత్సహిస్తూ ఆశలచివుళ్ళను
అందని ద్రాక్షలనుగాచేస్తూ
 మున్ముందుకు సాగ వలసి వచ్చిందో--



ఒక సంతోష ప్రకటనకోసం
ఎన్నెన్ని దు:ఖాశ్రువులను నిర్దాక్షిణ్యంగా
జలపాతలలకు వదిలేసి
పైపైకి గుంభనంగా బాధామయ
హృదయాన్ని భారంగా మోస్తూ నడుస్తూ వచ్చానో---
-----------------------------------------------------------------------------








No comments:

Post a Comment