Sunday, March 20, 2016

పడిలేచే కెరటాలవైపే
పదే పదే దృష్టి
సారించాలనిపిస్తుంది---

శిశిరం రాల్చిపడేసిన
ఆకులవైపే అలా చూపును
నిలిపి వుంచుదామనిపిస్తుంది.---

అరిగిపోయిన ఆపాతమధురమైన
పాటలనే వీనుల విందుగా
వినాలనిపిస్తూనూ వుంటుంది..

కృస్ణశాస్త్రిగారి కృష్ణపక్షాన్నే
పదేపదే చదువుతూ మురిసి
ముక్కలవాలనిపిస్తుంది----

చివరకేమైనా ఈ మట్టిబుర్రలో
మిగిలిపొతుందో లేదో తెలియదుగాని
ఉదయాన్నే అద్దం గుర్తు చేసిన నా ముదిమిని
ముచ్చటగా అంతరంగంలో అనుభూతి గీతంగా
ఆవిష్కరించుకోవాలన్న ధ్యాసతో మాత్రం అనునిత్యం
అవగాహనా సదస్సుల కనుగుణంగా
మూల్యాం కనం చేసుకుంటూ ముందుకు సాగుతుంటాను..
===========================================







No comments:

Post a Comment