వేడి వేడి పకోడీలు చుట్టబడివచ్చినాసరే--
ఆకాగితంలోని వాడిగా తగిలే
కవితా సుమబాణపు గుబాళింపు నాకెంతో ఇష్టం --
ప్రపంచమంతటా విస్తరించిన కవిహృదయం
నాకు అనుభూతి సంద్రమై గోచరిస్తుంది..
ఆత్మీయతానురాగపు అలలను చెంపలకు తాకిస్తూ
మనోహరమైన ఓ రామణీయకతను
ఆవిష్కరిస్తున్నట్లనిపిస్తుంది
ఆ కాగితానికంటుకున్న నూనెలా
ఆకవితాసారం నామనోఫలకంపై
చెరగని ముద్రవేసి అలరిస్తుంది..
కవిత్వమంటే ఒక గుబాళింపు
కమ్మగా నాసికకు తగిలే
ఒకానొక ఇంగువ బాగా
దట్టించిన ఘుమాయింపుల తాలింపు--
=============================
ఆకాగితంలోని వాడిగా తగిలే
కవితా సుమబాణపు గుబాళింపు నాకెంతో ఇష్టం --
ప్రపంచమంతటా విస్తరించిన కవిహృదయం
నాకు అనుభూతి సంద్రమై గోచరిస్తుంది..
ఆత్మీయతానురాగపు అలలను చెంపలకు తాకిస్తూ
మనోహరమైన ఓ రామణీయకతను
ఆవిష్కరిస్తున్నట్లనిపిస్తుంది
ఆ కాగితానికంటుకున్న నూనెలా
ఆకవితాసారం నామనోఫలకంపై
చెరగని ముద్రవేసి అలరిస్తుంది..
కవిత్వమంటే ఒక గుబాళింపు
కమ్మగా నాసికకు తగిలే
ఒకానొక ఇంగువ బాగా
దట్టించిన ఘుమాయింపుల తాలింపు--
=============================
No comments:
Post a Comment