అతడు చీకటిలోంచి
వెలుగులోకి వడివడిగా
విస్తరించగల
వెలుగు దివ్వె.
నిండుగా అంచులంటి
అనురాగానుభూతులను
ఒరుసుకుంటూ ప్రవహించే
ఒక తీయని జ్ఞాపకం.
కొత్తగా గుర్రమెక్కి
క్షేమంకరమైన
కోరికలతో స్వారీచేయాలనుకునే
యువతను ఒకచో దగ్గరకు చేర్చి
అమృతధారలను పరస్పరం
పంచుకునేలా ప్రయత్నిస్తున్న
శ్రేయోభిలాషులకు
నిర్మలమౌ
నదీ సంగమం.
అతడుఎవరైతేనేం
సహృదయ కళాపీఠం
సౌశీల్యానికి
సోయగాల దర్పణం.
---------------------------------
వెలుగులోకి వడివడిగా
విస్తరించగల
వెలుగు దివ్వె.
నిండుగా అంచులంటి
అనురాగానుభూతులను
ఒరుసుకుంటూ ప్రవహించే
ఒక తీయని జ్ఞాపకం.
కొత్తగా గుర్రమెక్కి
క్షేమంకరమైన
కోరికలతో స్వారీచేయాలనుకునే
యువతను ఒకచో దగ్గరకు చేర్చి
అమృతధారలను పరస్పరం
పంచుకునేలా ప్రయత్నిస్తున్న
శ్రేయోభిలాషులకు
నిర్మలమౌ
నదీ సంగమం.
అతడుఎవరైతేనేం
సహృదయ కళాపీఠం
సౌశీల్యానికి
సోయగాల దర్పణం.
---------------------------------
No comments:
Post a Comment