Saturday, March 19, 2016

అభ్యాగతం
----------------రావెల.


మట్టిమీద సంతకంచేయగల
మనిషికోసం వెదుకుతున్నాను.
అక్కడ మట్టిలో పెరగాల్సిన
 పంటలేం కనుచూపుమేరలో కనబడలా!!


ఆకాశ హర్మ్యాల నిర్మాణాల
 హడావుడి మాత్రమే కళ్ళకు
కట్టినట్లు కనిపించింది----
పొలాలను నమ్ముకున్న అన్నదాతలు
వాటిని  అమ్ముకున్న దిగుళ్ళతో
అటు చెట్లకు వేలాడుతూనో
పొలంగట్ల వెంట విషండబ్బాలతోనో
కళ్లకు క్రమేపీ  కనబడి కనుమరుగౌతున్నారు..


గబగబా వస్తుందనుకున్న
ఉగాది గబాల్ను
వురేసుకుందేమో ననిపించింది.

శిశిరమే శాశ్వత చిరునామాగా
మిగలి పోతుందని పంచాంగం చెబుతున్నది..

ఆదాయంకన్నా వ్యయమే అధికమని
అధిష్టానంవారి బడ్జెట్
చెప్పకయే చెబుతున్నది

అధిష్టానంవారి బడ్జెట్
చెప్పకయే చెబుతున్నది
ఆర్ధిక శాస్త్రం ఆ సత్యాన్నే
పదే పదే వల్లించి వేధిస్తున్నది.
రాజ్యం ద్వారా అవమానమే హెచ్చు శాతమని
హెచ్చరికలు కూడా  చేస్తున్నది..

ఈ సంవత్సరం రాజు
 విహంగ యానంలో
మునిగితేలుతాడని ముందస్తుగా
జాగ్రత్తలు  చెబుతున్నది--

ప్రతిపక్షానికి ప్రతిసారీ
ఎదురుదెబ్బలే ఖాయమని
అధికార యంత్రాంగం
అత్యవసరంగా శాసిస్తున్నది.

చట్ట సభలు తిట్టుపదాలకే
పరిమిత  మైపోయాయని
ఘట్టిగా విశ్వ సిస్తున్నానని
కరాఖండీగా తేల్చి చెబుతున్నది..

ఆనూచానంగా వస్తున్న ఈ ఆచారాన్ని
ప్రభుత్వం అర్ధాంతరంగా ముగించి
ఇదంతా ప్రజా సంక్షేమంకోసమేనంటూ
ఇరుల తెరవెనుకకు
ఇనుప హృదయంతో
శీఘ్రంగా చిత్తగించింది.
----------------------------------------19-3-16


No comments:

Post a Comment