Tuesday, March 1, 2016

అంతర్యానం
-------------------రావెల.

్్్్్్్్్్్్్్్్
నాలో వుంటూనే  నాతో
దాగుడుమూతలాదుతున్న
నన్ను నేనే
 వెదుక్కోవాలని
ప్రయత్నిస్తూ ముందుకు
సాగుతున్నాను----

అవరోధాల అంచుల్లోనే
ప్రతిక్షణం చిక్కుకుపోతూ
ఆశయం నెరవేరదేమోనని
విచికిత్స లో విసిగి
వేసారుతున్నాను.

ఎన్ని దబాటు వానలు నన్ను
భయపెట్టాలని చూసినా
వెనుదిరిగిపోయేటంత
భీరుడిని కూడా కాదునేను.

విసురుగా గాలి ఎంతగా
జబురుతున్నా జడిసే
మనస్తత్వం కాదునాది .


అపజయాల పలుకునే అస్సలు
అంతరాంతరళాల్లోకి
 జొరబడనీను సుమా!!

బ్రదుకు బాటలో
ఎత్తుపల్లాలను ఎదుర్కొనే
కృత నిశ్చయంతోనే ఈ ప్రయత్నానికి
సిద్ధమయే నేను నా హృదయాన్ని
శిల మాదిరిగా స్థిరీకరించుకుని
బయలు దేరాను. మార్గమధ్యంలో
పాంధశాలలుంటే విశ్రాంతి తీసుకుని
అప్పటిదాకా నా ప్రస్థానంలోని
బాగోగులను మూల్యాంకనం చేసుకుంటూ
చేర్పులు మార్పులతో ఎప్పటికప్పుడు
నన్ను నేను నవీకరించుకుంటూ
 ముందుకు దూసుకుపోతాను.
==============================



No comments:

Post a Comment