అనుశాసనపర్వం
--------------------
సోమరివాళ్ళనందరినీ
హతమార్చేసారు
ఇక ఆకాశం అంచులదాకా
పారిశ్రామిక ధూమమే
ఎగసిపడుతుందని విశ్వాసం.
కురూపులనందరినీ
కునారిల్లేలాచేసేసారు
ఇక ప్రపంచంతా
సౌందర్య ధామమై విలసిల్లుతుంది.
బుద్ధి హీనులనదరినీ
పలాయనం చిత్తగించేలా చేసారు
ఇక భావిప్రపంచమంతా
మేధావుల స్వర్గసీమయేనట.
రోగగ్రస్తులనందరినీ వదిలించుకున్నారు
ఆరోగ్య ధామమై ఇక జగతి వికసిస్తుంది.
బాధాతప్త హృదయులందరినీ
బహిష్కృతులను గావించారు.
ఇక ఆనంద నందనవనమే ప్రపంచమంతా!
ముసలి వాళ్ళను మట్టుబెట్టడం మొదలెట్టారట
రేపటి ప్రపంచమంతా నవనవేన్మేషమై
యవ్వన కాంతులతోవిలసిల్లుతుంది.
శతృ మూకనంతటినీ సం హరించడం పూర్తయింది.
ఇక స్నేహ సుహృద్భావాలే పాదుకుంటాయిజగమంతటా!!
సైనిక స్థావరాలనన్నింటినీ పూర్తిగా ఖాళీ చేయించారు.
ఇక భూతలమంతా శాంతినికేతనమై ప్రకాశిస్తుంది.
ఒక్క సూచననే మరచినట్టున్నారు
మనుషులనందరినీ ఈ మహీతలమ్నుండి
మట్టుబెట్టి మశానానికి తరలిస్తే
అవనీ తలమంతా సురలోకవాసమౌతుందేమో
మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను..
--------------------------------------------------------
[1921-1988 ప్రాoతంలోని ఆంగ్ల కవితకు అనుసరణ !!]
--------------------
సోమరివాళ్ళనందరినీ
హతమార్చేసారు
ఇక ఆకాశం అంచులదాకా
పారిశ్రామిక ధూమమే
ఎగసిపడుతుందని విశ్వాసం.
కురూపులనందరినీ
కునారిల్లేలాచేసేసారు
ఇక ప్రపంచంతా
సౌందర్య ధామమై విలసిల్లుతుంది.
బుద్ధి హీనులనదరినీ
పలాయనం చిత్తగించేలా చేసారు
ఇక భావిప్రపంచమంతా
మేధావుల స్వర్గసీమయేనట.
రోగగ్రస్తులనందరినీ వదిలించుకున్నారు
ఆరోగ్య ధామమై ఇక జగతి వికసిస్తుంది.
బాధాతప్త హృదయులందరినీ
బహిష్కృతులను గావించారు.
ఇక ఆనంద నందనవనమే ప్రపంచమంతా!
ముసలి వాళ్ళను మట్టుబెట్టడం మొదలెట్టారట
రేపటి ప్రపంచమంతా నవనవేన్మేషమై
యవ్వన కాంతులతోవిలసిల్లుతుంది.
శతృ మూకనంతటినీ సం హరించడం పూర్తయింది.
ఇక స్నేహ సుహృద్భావాలే పాదుకుంటాయిజగమంతటా!!
సైనిక స్థావరాలనన్నింటినీ పూర్తిగా ఖాళీ చేయించారు.
ఇక భూతలమంతా శాంతినికేతనమై ప్రకాశిస్తుంది.
ఒక్క సూచననే మరచినట్టున్నారు
మనుషులనందరినీ ఈ మహీతలమ్నుండి
మట్టుబెట్టి మశానానికి తరలిస్తే
అవనీ తలమంతా సురలోకవాసమౌతుందేమో
మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను..
--------------------------------------------------------
[1921-1988 ప్రాoతంలోని ఆంగ్ల కవితకు అనుసరణ !!]
No comments:
Post a Comment