ముసిముసి నవ్వులతో మిళితం చేసి
గుస గుసలుగా వినిపించే నీ మృదుమధురమౌ
భాషణలను అర్ధాంతరంగా ముగించాలని ఆవేశపడకు..
నా మనో ఫలకంపైముద్రించుకోవాలని
భావించే నీరూప లావణ్యాలసిరిసంపదలకు
మరకలంటించి మలినంగావించాలని తలపోయకు..
లే మావి చిగురలను మేసి మనోజ్ఞంగా ఆలపిస్తున్న
కోయిలమ్మ కొత్తగా పాడే ఆమని గీతాలకు
అపస్వరాలను ధ్వనిముద్రితం చేసి ఆసంగీత సంకలనాలను
అభాసుపాలుచేయాలన్న ఆశలను పెంచుకోకు----
రామణీయకమైన ప్రకృతి చిత్రాలకు
రంగులద్ది మరింత శోభాయమానంగా
తీర్చి దిద్దుదామని శ్రమిస్తుంటే
ఆ కష్టాన్ని బూడిదలో పొసిన
పన్నీరులా మార్చాలని ప్రయత్నించకు---
ఇద్దరూ సౌందర్యారాధకులమే నని యావజ్జగతీ
వేనోళ్ళమనలను కీర్తిస్తూ పోతుంటే దాన్ని
వృధా ప్రయాసగా మార్చాలని విశేషంగా శ్రమించకు--
గుస గుసలుగా వినిపించే నీ మృదుమధురమౌ
భాషణలను అర్ధాంతరంగా ముగించాలని ఆవేశపడకు..
నా మనో ఫలకంపైముద్రించుకోవాలని
భావించే నీరూప లావణ్యాలసిరిసంపదలకు
మరకలంటించి మలినంగావించాలని తలపోయకు..
లే మావి చిగురలను మేసి మనోజ్ఞంగా ఆలపిస్తున్న
కోయిలమ్మ కొత్తగా పాడే ఆమని గీతాలకు
అపస్వరాలను ధ్వనిముద్రితం చేసి ఆసంగీత సంకలనాలను
అభాసుపాలుచేయాలన్న ఆశలను పెంచుకోకు----
రామణీయకమైన ప్రకృతి చిత్రాలకు
రంగులద్ది మరింత శోభాయమానంగా
తీర్చి దిద్దుదామని శ్రమిస్తుంటే
ఆ కష్టాన్ని బూడిదలో పొసిన
పన్నీరులా మార్చాలని ప్రయత్నించకు---
ఇద్దరూ సౌందర్యారాధకులమే నని యావజ్జగతీ
వేనోళ్ళమనలను కీర్తిస్తూ పోతుంటే దాన్ని
వృధా ప్రయాసగా మార్చాలని విశేషంగా శ్రమించకు--
=================================
No comments:
Post a Comment