Monday, March 7, 2016

గోడచాటునుండి గొప్పగా పిలిచే వసంతం
కనుకొలకులోకి తొంగి చూస్తూ
 ఎలాకవ్విస్తుందో చూడు---
నిన్నటిదాకా నిరాశగుప్పిట్లో
ఊపిరాడకుండా ఎంత
ఉక్కిరిబిక్కిరయిందో గదా పాపం
మావిచిగురుతిన్న కోయిలను చూసి
మనసంతా పాటలను నింపుకుని
పరవశించి పోతున్నది ఈవసంత యామిని
లేచివురాకులజొంపాల్లో ఊయలలూగాలని
ఉత్సాహం ఊపిరిగా చేసుకుని
 ఉచ్చిలి పడుతున్నది.

ఇది అయిష్టానికి చేరువయే
 ఋతుహేల కానేకాదు
ఆబాల గోపాలాన్న్ని అనవరతం
అలరించే భామిని ఈ యామిని---
రావేరావే వసంతమా!
నవమానవజీవన మరాళమా!!
---------------------------------------------

No comments:

Post a Comment