అవును నేనెప్పుడూ స్వార్ధపూరితంగా
నిన్ను గురించే ఆలోచిస్తూ గడిపే వాడిని
రాత్రిం బవళ్ళూ నీ ధ్యాసలోనే గడిపాను.
విసురుగా వీస్తున్న ఆ అసుర ఝంఝకు
ఇలా నేలకు రాలిపడతావని భావించలేకపోయాను.
ఇప్పుడు ఒక జ్ఞాపకంగానే ఇలా ఊహల్లో మిగిలిపోయావు
అనుభవాలను,అనుభూతులను ఎలా మరిచిపొమ్మంటావు?
గాలి గుసగుసలలో నీవే వినిపిస్తుంటావు--
వెలుగు వెన్నెల రాత్రంతా నీవే కనిపిస్తుంటావు.
తొలగిన స్వప్నంలో,తొణికిన స్వర్గంలోనూ నీవే వికసిస్తావు.
నిన్నెలా మరచి మనగలనను కుంటున్నావు?
====================================

No comments:
Post a Comment