పరితాపం
------------------రావెల.
రంగులకుంచెతో పయనిస్తూ
రామణీయకతను ప్రదర్శించే
కాన్వాసుకూడా ఇప్పుడు ఏకంగా
కన్నీరు కార్చడం నేర్చుకుంది.
భగవంతుని రూపం చిత్రించినప్పుడల్లా
పేరులేని బికారి మతాలకు స్థిరనివాసమైన
గుళ్ళముందుగీసే చాక్పీసు చిత్రాలకన్నా తన
జీవనకాలం ఎక్కువనుకుంటూ
తనలోతానే మురిసిపోతున్నాడు.
ఆరుగాలాలపాటు స్వేదం వెలార్చి పండించిన
పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే
గిట్టుబాటు ధరకు నోచుకోకుండా దిగాలపడిన పంటను చూసి
చేసిన అప్పులు చెల్లుబాటు ఏసే దారితోచక పంటనాశించిన
పురుగులను చంప లేకపోయిన క్రిమి సమ్హారకం తననే చేస్తుందిలెమ్మని
ఒక్క గుక్కలో తాగేస్తే --అదికాస్తా ప్రాణాలను హరిస్తుంటే
చూసితట్టుకోలేని కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని చిత్రించగల నాధుడులేదని
పరితపిస్తూన్న కాన్వాసు బోర్డు ఏకధారగా కన్నీరొలికిస్తూ కూర్చుంది.
============================================

No comments:
Post a Comment