Wednesday, March 9, 2016

పునరంకితం
---------------------రావెల.

సావధానంగా సప్తతికి చేరుకుంటున్నానేను
ప్రతిరోజూ వల్లించే సుభాషితమొక్కటే సుమా!
పిరికివాదు రోజూ మరణిస్తాడుకాన్
 భీరుడుకాని ఈ సుగుణాబ్భిరాముడైన ధీరుడు
ఎప్పుడోఒక్కరోజు చెప్పాపెట్టకుండా నిష్క్రమిస్తాడు.

కోరికలన్నీ తీరాయనితెలిసాక అందరు సంతానం
హాయిగాస్థిరపడ్డారని నిర్ణయించుకున్నాక
ఇంక దేనికోసమో వెంపర్లాడ వలసిన అవసరంలేదనుకున్నాక
ఇంకెప్పుడూ వైద్య శాలకు వెళ్ళడమంటే భయమన్నదే లేదని గ్రహించాక
వైద్యుడు చేసే పరీక్షలన్నింటినీ పూర్తయాయని తెలిసాక
ఫలితాలకోసమే నిరీక్షిస్తూ వేచి చూస్తున్న వేళకూడా
అదే సూక్తిమనసుపొరల్లో పరిభ్రమిస్తూ,కళవళ పడ  వద్దని

భుజం తడుతూ వెన్నెముకను సున్నితంగా సరిచేస్తూ
భయోత్పానికి చోటెందుకని కాలం సర్ది చెపుతూనే వుంటుంది..

ఆయన గారొచ్చి అంతా బాగుందనీ కంగారు పడే అవసరంలేదని
శాస్త్రపరంగా నిర్ధారణ చేసాకకూడా అదే సూక్తిని వల్లిస్తూ
అదే వేదవాక్యమని భావిస్తూ వుంటాను-- ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో
ఆ వందసంఖ్యలో ఒక్కటిని వ్యవకలనం చేసి ఆ సుప్రభాతసూక్తినే

మరోసారి గమనానికి తెచ్చుకుంటూ కాలక్షేపం చేస్తుంటాను--
మరొకసారి నా దైనందిన చర్యలను
 పునశ్చరణగావించుకుంటూ పునరంకితమౌతూ సాగుతుంటాను.
---------
[ఒక ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో-]

No comments:

Post a Comment