అనిర్వచనీయం
--------------------రావెల
*******************************
అకస్మాత్తుగా ఓ అర్ధరాత్రిపూట
ఓ చుక్క నేలకు రాలిపడింది
అందరినీ ఆశ్చర్యచకితులనుజేసి
అంతర్ధానమై పోయింది--
సంస్కృఇతికి నానాటికీ దూరమవుతున్న
జాతి వైముఖ్య ప్రదర్శనకు ఖేదపడిందా?
సంప్రదాయాన్ని అడవులుజేస్తున్న సమాజంపై
నిరసనగా నిష్క్రమించిందా?
బాల్యాన్ని క్రీడలకు దూరంగా విసురుతున్న
విద్యా వ్యాసంగానికి విస్తుపోయివుంటుందేమో--
వెలుగులను విస్తరించవలసిన విశ్వానికి
పొరపొచ్చాలనీడలు పరుస్తూపోతున్న
వ్యవస్థపై విసుగుపుట్టి స్వఛ్చందంగా
విరమణను స్వీకరించిందా?
చదువుకునే అవకాశాలను కోల్పోపోయిన వారందరూ
చదువుకొనగలుగుతున్నవారిపట్ల
నిస్పృహజ్వాలలను వెలారుస్తుంటే
ఆ వేడిమిని భరించలేక
వెలుగుదారులను వీడిందా?
అంతా అస్తవ్యస్తమై,అగమ్యగోచరమై
కలుపుమొక్కల్లా పెరుగుతూ అమృత ఫలాల సాగుకు
అవరోధాలుగా మిగిలిపోతుంటే బాధతో బహిష్కరించిందా ?
ఏదేమైతేనేం ఎంతత్వరగా ఈ సమస్యలతోరణాలు
వాడుముఖం వేస్తే బాగుండు.
ఈ దిన దిన గండంగా మారిన వాటినన్నింటినీ
ఓపిగ్గా కట్టగట్టి పారే ఏరుకుకూడా అందనంత దూరంగా
అగాధాల అంచుల చివరిదాకా విసరగలిగితేబావుణ్ణు.
ఆప్యాయతానురాగాల అనుభూతులు మళ్ళీ పునరుజ్జీవనానికి
నోచుకోగలిగితే మనమంతా ధన్య జీవులమై శేషజీవితాలను
సుఖమూ శాంతులను కలబోసిన మార్గ గాములమై తరించవచ్చును.
ఈ బాధ అనంతమైనది
అంధకారబంధురమైనది
అనిర్వచనీయమై అలరారుతున్న ఈబాధను
అశాశ్వతంచేయాలనే నా తపన--
--------------------------------------
ఈ కవిత నాస్వంతం దేనికీ అనుకరణగానీ అనువాదంగానీ
అనుసరణగానీ కాదని హామీ..
ఇత: పూర్వం ఎక్కడా ప్రచురితంకాలేదనీ
ప్రచురణకు,పరిశీలనకు పంపబడలేదని హామీ--
--------------------
రావెల పురుషోత్తమ రావు
3236 apt # B
Normandy Woods DR
EllicoTT city MD 21043
supani@ gmail.com
--------------------రావెల
*******************************
అకస్మాత్తుగా ఓ అర్ధరాత్రిపూట
ఓ చుక్క నేలకు రాలిపడింది
అందరినీ ఆశ్చర్యచకితులనుజేసి
అంతర్ధానమై పోయింది--
సంస్కృఇతికి నానాటికీ దూరమవుతున్న
జాతి వైముఖ్య ప్రదర్శనకు ఖేదపడిందా?
సంప్రదాయాన్ని అడవులుజేస్తున్న సమాజంపై
నిరసనగా నిష్క్రమించిందా?
బాల్యాన్ని క్రీడలకు దూరంగా విసురుతున్న
విద్యా వ్యాసంగానికి విస్తుపోయివుంటుందేమో--
వెలుగులను విస్తరించవలసిన విశ్వానికి
పొరపొచ్చాలనీడలు పరుస్తూపోతున్న
వ్యవస్థపై విసుగుపుట్టి స్వఛ్చందంగా
విరమణను స్వీకరించిందా?
చదువుకునే అవకాశాలను కోల్పోపోయిన వారందరూ
చదువుకొనగలుగుతున్నవారిపట్ల
నిస్పృహజ్వాలలను వెలారుస్తుంటే
ఆ వేడిమిని భరించలేక
వెలుగుదారులను వీడిందా?
అంతా అస్తవ్యస్తమై,అగమ్యగోచరమై
కలుపుమొక్కల్లా పెరుగుతూ అమృత ఫలాల సాగుకు
అవరోధాలుగా మిగిలిపోతుంటే బాధతో బహిష్కరించిందా ?
ఏదేమైతేనేం ఎంతత్వరగా ఈ సమస్యలతోరణాలు
వాడుముఖం వేస్తే బాగుండు.
ఈ దిన దిన గండంగా మారిన వాటినన్నింటినీ
ఓపిగ్గా కట్టగట్టి పారే ఏరుకుకూడా అందనంత దూరంగా
అగాధాల అంచుల చివరిదాకా విసరగలిగితేబావుణ్ణు.
ఆప్యాయతానురాగాల అనుభూతులు మళ్ళీ పునరుజ్జీవనానికి
నోచుకోగలిగితే మనమంతా ధన్య జీవులమై శేషజీవితాలను
సుఖమూ శాంతులను కలబోసిన మార్గ గాములమై తరించవచ్చును.
ఈ బాధ అనంతమైనది
అంధకారబంధురమైనది
అనిర్వచనీయమై అలరారుతున్న ఈబాధను
అశాశ్వతంచేయాలనే నా తపన--
--------------------------------------
ఈ కవిత నాస్వంతం దేనికీ అనుకరణగానీ అనువాదంగానీ
అనుసరణగానీ కాదని హామీ..
ఇత: పూర్వం ఎక్కడా ప్రచురితంకాలేదనీ
ప్రచురణకు,పరిశీలనకు పంపబడలేదని హామీ--
--------------------
రావెల పురుషోత్తమ రావు
3236 apt # B
Normandy Woods DR
EllicoTT city MD 21043
supani@ gmail.com
No comments:
Post a Comment