ఒక గాఢమైన మెలకువకోసం
ఎన్నెన్ని నిద్రరాని రాత్రులను
నిండా నిమజ్జనంచేసి నిర్ణిద్రాగానపు
జోలపాటలతో మాయబుచ్చవలసి వచ్చిందో--
ఒక విజయంకోసం ఎన్నాళ్ళుగానో
తపస్సమాధిలో మునిగి
దీక్షాకంకణధారులైన
వీరాధి వీరులుకన్న కలలను
కాలవహ్నిలో కడదాకా దహింపజేసి
భస్మీపటలం చేయవలసి వచ్చిందో---
ఒక అనృతం కురవ వలసిన రాత్రికోసం
ఎన్నెన్ని చేదువిషాలను విషయమగ్నం చేసి
వివరణలను విభిన్నంగా పగటి
బండరాళ్ళక్రింద దాచవలసి వచ్చిందో--
=====================================
ఎన్నెన్ని నిద్రరాని రాత్రులను
నిండా నిమజ్జనంచేసి నిర్ణిద్రాగానపు
జోలపాటలతో మాయబుచ్చవలసి వచ్చిందో--
ఒక విజయంకోసం ఎన్నాళ్ళుగానో
తపస్సమాధిలో మునిగి
దీక్షాకంకణధారులైన
వీరాధి వీరులుకన్న కలలను
కాలవహ్నిలో కడదాకా దహింపజేసి
భస్మీపటలం చేయవలసి వచ్చిందో---
ఒక అనృతం కురవ వలసిన రాత్రికోసం
ఎన్నెన్ని చేదువిషాలను విషయమగ్నం చేసి
వివరణలను విభిన్నంగా పగటి
బండరాళ్ళక్రింద దాచవలసి వచ్చిందో--
=====================================
No comments:
Post a Comment