సౌప్తికపర్వం--
----------------------రావెల
అనునిత్యం పంటపొలాలమధ్యన
ఉచ్ఛ్వాస నిశ్వాలతో ఊపిరిపీలుస్తూ
బ్రదుకులను వెళ్ళదీసిన మనుషులం మేము--
ఇవ్వాళ మీ అవసరాలకోసమని మమ్మల్ను
ఈ పల్లె తడి వొడికి దూరంగా విసిరేస్తానంటే
చట్టాల చట్రాలలో బిగించి మీరు చూపిన భూతాలను చూసి
భయ విహ్వలులమై అలా అంగీకార పత్రాలపై అయిష్టంగానే
సమంతకాలనుచేసి--రాబోయే రాజధానిలో ఎగసిపడే
ఆకాశహర్మ్యాలను చూస్తూ ఖిన్నవదనులం కాక తప్పదు.
ఇంకోచోట ఇవేరకంగా పొలాలు, కుంటలు,ఆకాశం అలరిస్తాయిగదా
అని అనుకుంటే అది కేవలం ఒక భ్రమాన్వితమైన
అపప్రధగానే మిగిలిపోవడం మాంత్రం సత్యం.
అక్కడా గొడ్లూ పాకలూ గోదాములూ ఇంతకన్నా సుఖవంతమైన
రహదారులూ మీరు కల్పించడంఖాయమే కాదనం--కానీ
కన్న తల్లికి దూరంగా విసిరేసి ఆ తల్లిని మీ స్వార్ధప్రయోజనాలకోసం
మరొక అయ్య చేతులోకి బదిలీ చేసి బాగుపదటాము మేమని
మీరంటే చేయగలిగినదేమీలేదు.తలొంచుకుని ధారాపాతంగా కారే కన్నీళ్ళను దాచుకునే
ఖజానాలు లేక దయనీయంగా బ్రదుకునీడ్చే దౌర్భాగ్యం మీరే రాసిపెడితే
ఏం చెయ్యగలం మేము మీరే చెప్పండి---
అక్కడున్నాకూడా మాపొలల్లో మీరు నిర్మించే సకల సౌకర్యాల భవనాలూ
ప్రతి క్షణం మాకు పంటపొలాల్లో ఏపుగా పెరిగే పిచ్చి కలుపు మొక్కల్లానే కనిపిస్తుంటాయి.
విధినడ్దం పెట్టుకుని మా విధిలిఖితాలాను ంబండ రాయిల్లాంటి శాసనాలతో
చెక్కేసిన ప్రభుతమీది--అవన్నీ మీరు గీసిన పిచ్చిగీతలాన్ని మేమెరుగుదుం.
పగిలిన అద్దాంలో కనిపించే వేయి దు:ఖాలతో సహా బ్రతికుండగానే
ఖననం చేయ బడ్ద శవసదృశ్యమైన జీవితాలు మావి--ఆకర్షణీయంగా పైకి కనిపించినా
ఆరక్షణీయమైన అక్షారాలమాధ్యన అలమటించే శోకతప్త హృదాయాలుమావి..
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
[1863-11933 ప్రాంతంలో జీవించిన కవి రాసిన కవితను నేపధ్యంగా---]

No comments:
Post a Comment